Fuel Efficient Car: ఈ కారుకు సరిలేదు మరేది.. అధిక మైలేజీ.. అత్యద్భుత ఫీచర్లు.. అతి తక్కువ ధరలోనే..
మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అనువైన బడ్జెట్లో లభించే మారుతి సుజుకీ లైనప్ లో అధిక ఇంధన సామర్థ్యం కలిగిన కారును ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్న కార్లలో ఇదే బెస్ట్ మైలేజీతో పాటు అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఆ కారు పేరు మారుతి సుజుకీ సెలెరియో. ఈ కారు పెట్రోల్ అలాగే సీఎన్జీ వెర్షన్లో అందుబాటులో ఉంది. పెట్రోల్ వెర్షన్ కారు ఒక లీటర్ పై 26.68కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అదే సమయంలో సీఎన్జీ ఒక కేజీపై 35.60 కిలోమీటర్లు అందిస్తుంది.

మంచి మైలేజీ ఇచ్చే కారు కావాలా? దూర ప్రయాణాలు ఎటువంటి ఆందోళన లేకుండా చేయాలనుకుంటున్నారా? అది కూడా అతి తక్కువ ధరలో లభిస్తే బాగుండని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అనువైన బడ్జెట్లో లభించే మారుతి సుజుకీ లైనప్ లో అధిక ఇంధన సామర్థ్యం కలిగిన కారును ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్న కార్లలో ఇదే బెస్ట్ మైలేజీతో పాటు అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఆ కారు పేరు మారుతి సుజుకీ సెలెరియో. ఈ కారు పెట్రోల్ అలాగే సీఎన్జీ వెర్షన్లో అందుబాటులో ఉంది. పెట్రోల్ వెర్షన్ కారు ఒక లీటర్ పై 26.68కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అదే సమయంలో సీఎన్జీ ఒక కేజీపై 35.60 కిలోమీటర్లు అందిస్తుంది.
మైలేజీకి మరేది సాటి రాదు.. సెలెరియో 32-లీటర్ ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. ఇది లీటరుకు 26.68 కిమీ మైలేజీ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్‌పై 853 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దీని అర్థం మీరు ఢిల్లీ నుండి భోపాల్, ఢిల్లీ నుంచి ఉదయపూర్, ఢిల్లీ నుండి ప్రయాగ్‌రాజ్ లేదా ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణిస్తుంచవచ్చు. మైలేజీ పరంగా, సెలెరియో మారుతి నుండి వచ్చిన అన్ని మోడళ్ల కన్నా ఇదే టాప్ ప్లేస్ లో ఉంటుంది. దీంతో పాటు టాటా, హ్యుందాయ్ వంటి ఇతర తయారీదారుల కార్లను కూడా అధిగమిస్తుంది.
ఇంజిన్ సామర్థ్యం ఇది.. సెలెరియోలో కే10సీ డ్యూయల్ జెట్ 1.0-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 66 హార్స్‌పవర్, 89ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ రెండింటితోనూ లభిస్తుంది.
డిజైన్ అండ్ లుక్.. సెలెరియో బయట వైపు డిజైన్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇందులో రేడియంట్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్ యూనిట్, ఫాగ్ లైట్ కేసింగ్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ బ్లాక్ ఎలిమెంట్స్‌తో ఉంటుంది. మరికొన్ని డిజైన్ అంశాలు ఎస్-ప్రెస్సో మాదిరిగా ఉంటాయి.15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వెనుక భాగంలో, మీరు బాడీ-కలర్ రియర్ బంపర్, సొగసైన టెయిల్‌లైట్‌లు, కర్వాసియస్ టెయిల్‌గేట్ ఉంటాయి.
ఇంటిరీయర్ ఇలా.. కారు లోపలి భాగంలో సెంటర్-ఫోకస్డ్ డిజైన్, క్రోమ్‌తో కూడిన ట్విన్-స్లాట్ ఏసీ వెంట్లు, కొత్త గేర్ షిఫ్ట్ డిజైన్, రీడిజైన్ చేసిన అప్హోల్స్టరీ ఉన్నాయి. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో రెండింటికి మద్దతు ఇస్తుంది. 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్లు.. సెలెరియో 12 భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటాయి.
కారు ధర, లభ్యత..
ఈ కారు సాలిడ్ ఫైర్ రెడ్, స్పీడీ బ్లూ, ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, గ్లిస్టనింగ్ గ్రే, కెఫిన్ ఆనియన్, రెడ్, బ్లూ వంటి ఆరు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ. 5.37 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ కారుపై రూ. 64,000 వరకూ మారుతి సుజుకీ తగ్గింపును అందిస్తుంది. దీనిలో రూ. 40,000 డైరెక్ట్ క్యాష్ తగ్గింపు కాగా.. రూ. 20,000 ఎక్స్ చేంజ్ బోనస్, మిగిలిన రూ. 4000 కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది. ఈ కారుకు మన దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలివరీకి మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కారుకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..