Free Insurance: మీ ఏటీఎం కార్డుపై బీమా కవరేజి ఉందని మీకు తెలుసా? రూ. 1కోటి వరకూ క్లయిమ్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు..
మీకు బ్యాంకు అకౌంట్ ఉందా.. ఏటీఎం కార్డు తరచూ వాడుతూ ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఆ కార్డులపై ఉచిత ప్రమాద బీమా, జీవిత బీమా పొందే అవకాశం ఉంది. దాదాపు ఒక కోటి రూపాయల వరకూ క్లయిమ్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి..

మీకు బ్యాంకు అకౌంట్ ఉందా.. ఏటీఎం కార్డు తరచూ వాడుతూ ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఆ కార్డులపై ఉచిత ప్రమాద బీమా, ఉచిత జీవిత బీమా పొందే అవకాశం ఉంది. సాధారణంగా చాలా మంది ప్రైవేటు ఏజెన్సీలు లేదా ఎల్ఐసీ వద్ద ఇన్యూరెన్స్ పాలసీ తీసుకుంటూ ఉంటారు. అయితే బ్యాంకులు ఉచితంగా దీనిని అదిస్తుంది. దేశీయంగా ఉన్న ప్రధాన బ్యాంకులన్నీ తమ డెబిట్ కార్డులపై ఈ అవకాశాన్ని ఇస్తాయి. అలాగే పోయిన సామాన్లు, లావాదేవీలకు రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలీదు. ఒకవేళ మీకూ దీనికి గురించి అవగాహన లేకపోతే ఈ కథనం చదవండి. ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లు తమ డెబిట్ కార్డులపై ఇచ్చే బీమా కవరేజి వివిరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక వేళ మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు..
కోటక్ మహీంద్రా బ్యాంక్..
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత యాక్సిడెంటల్ డెత్ ప్రయోజనాన్ని రూ. 25 లక్షల వరకూ అందిస్తుంది. బీమా కవరేజీని యాక్టివేట్ అవ్వాలంటే మీ బ్యాంకు ఏటీఎం ద్వారా తప్పనిసరిగా లావాదేవీ చేసి ఉండాలి. అది ఏటీఎం మెషీన్ ద్వారా అయినా, లేదా ఆన్ లైన్ అయినా ఏదైనా ఫర్వాలేదు. ప్రమాదం జరిగిన తేదీకి 90 రోజుల ముందు కనీసం ఒక్కసారైన కార్డుని ఉపయోగించి ఉండాలి. అంతేకాకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డు పోగొట్టుకుంటే మరో కవరేజీని అందజేస్తుంది. రూ. 6 లక్షల వరకూ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన కార్డులతో మర్చంట్, ఆన్ లైన్ పోర్టలలో చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఎస్ బీఐ డెబిట్ కార్డు రకాన్ని బట్టి విభిన్న విమానయాన యాక్సిడెంటెల్ డెత్ బీమాను అందిస్తుంది. స్థానిక, అంతర్జాతీయ విమానాలకు బ్యాగేజ్ పోగొట్టుకున్నా బీమాను కూడా అందిస్తుంది. అయితే ఎయిర్ లైన్ టికెట్ కొనుగోలుకు బ్యాంకు డెబిట్ కార్డు తప్పనిసరిగా వినియోగించి ఉండాలి. అలా చేయడంలో విఫలమైతే బీమా ప్రయోజనం పొందలేరు. ఒక వేళ కార్డు దారుడు విమాన ప్రమాదంలో మరణిస్లే బీమా కవరేజ్ దాదాపు రెట్టింపు అవుతుంది. ఎస్బీఐకి సంబంధించి వివిధ రకాల కార్డులపై ప్రమాద బీమా రూ. 10 లక్షల వరకూ ఉంటుంది. ఎస్బీఐ గోల్డ్ కు రూ. 2 లక్షలు, ప్లాటినం కార్డుకు రూ. 5 లక్షలు, ప్రైడ్ కార్డుకు రూ. 2 లక్షలు, ప్రీమియం కార్డుకు రూ. 5లక్షలు, వీసా, సిగ్నేచర్, మాస్టర్ కార్డులకు రూ.10 లక్షలు బీమా కవరేజ్ ఉంటుంది. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డులపై కొనగోలు చేసిన 90 రోజలలోపు, రూ. 1 లక్ష నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది.
హెచ్డీ ఎఫ్సీ బ్యాంక్..
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకుకు సంబంధించి ప్రమాద బీమా రూ. 5 లక్షలు ఉంటుంది. అలాగే లభించే ఎయిర్ యాక్సిండెటల్ ఇన్యూరెన్స్ రూ. 1కోటి వరకూ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..