Small Saving Schemes: కొత్త వడ్డీ రేట్లు ప్రకటన.. ఈ పథకాల ఖాతాదారులకు బంపర్ ఆఫర్..
చిన్న మొత్తాల పొదుపు పథకాలు(స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్). ఇటీవల కాలంలో వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అంటే పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి ఉంటాయి. మనం పొదుపు చేసే సొమ్ముకు కొంత వడ్డీని కలిసి టెన్యూర్ చివరిలో అందజేస్తారు. సాధారణంగా ఈ వడ్డీ మారుతుంటుంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేటుకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ అందిస్తుంది.

పన్ను ఆదా చేయడంతో పాటు దీర్ఘకాలంలో అధిక ఆదాయాన్ని అందించేవి చిన్న మొత్తాల పొదుపు పథకాలు(స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్). ఇటీవల కాలంలో వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అంటే పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి ఉంటాయి. మనం పొదుపు చేసే సొమ్ముకు కొంత వడ్డీని కలిసి టెన్యూర్ చివరిలో అందజేస్తారు. సాధారణంగా ఈ వడ్డీ మారుతుంటుంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేటుకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ అందిస్తుంది. ఈ క్రమంలోనే ఆయా పథకాలకు ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికి వడ్డీరేట్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వడ్డీ రేట్లలో మార్పు లేదు..
2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలకు వర్తించే వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఉన్న వడ్డీ వాటినే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. 2024 – 25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఏప్రిల్ ఒకటి నుంచి మొదలై జూన్ 30తో ముగుస్తాయి. అంటే ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) 7.1 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తుంది.
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి
- సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం
- ఒక ఏడాది డిపాజిట్ పై 6.9 శాతం
- రెండేళ్ల కాల డిపాజిట్ పై 7 శాతం
- మూడేళ్ల డిపాజిట్ల పై 7.1 శాతం
- ఐదేళ్ల డిపాజిట్ల పై 7.5 శాతం
- ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ల పై 6.7 శాతం
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై 8.2 శాతం
- నెలవారీ ఆదాయ ఖాతా పథకంపై 7.4 శాతం
- జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్ పై 7.7 శాతం
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై 7.1 శాతం
- కిసాన్ వికాస్ పట్నాపథకం 7.5 శాతం ( ఇది 115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది)
- సుకన్య సమృద్ధి ఖాతాలపై 8.2 శాతం
వడ్డీ రేట్లు నిర్ణయించే విధానం..
చిన్న పొదుపు పథకాలపై త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లను ప్రభుత్వం మామూలుగా అంచనా వేస్తుంది. వీటిని నిర్ణయించే పద్ధతిని శ్యామలా గోపీనాథ్ కమిటీ ప్రతిపాదించింది. ఆ ప్రకారం.. వివిధ పథకాల వడ్డీ రేట్లు సంబంధిత మెచ్యూరిటీలతో ప్రభుత్వ బాండ్ల రాబడుల కంటే 25 నుంచి 100 బేసిస్ పాయింట్ల వరకు ఉండాలి.
ఖాతాదారులకు ప్రయోజనం..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీ బీ) 2022 మే నెల నుంచి కీలకమైన రేట్ల పెంపుదలను అమలు చేసింది. తద్వారా బ్యాంకులు కూడా స్థిర డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు ప్రయోజనం కలిగింది. అయితే ఇటీవల జరిగిన నాలుగు పాలసీ సమావేశాల్లో ఆర్ బీఐ మరో నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లకు సర్ధుబాటు చేయకుండా యథాతథస్థితిని కొనసాగించాలనుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




