AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI FD schemes: ఎస్బీఐ నుంచి బెస్ట్ ఎఫ్‌డీ స్కీమ్స్ ఇవే.. ఆ పథకానికి మాత్రం మార్చి నెలాఖరు డెడ్ లైన్

ఎఫ్ డీలపై అన్ని బ్యాంకులు ఒకే వడ్డీరేటు ఇవ్వవు. అందువల్లనే సురక్షితమైన బ్యాంకుతో పాటు, అధిక వడ్డీరేటు ఇచ్చే బ్యాంకులను ఎంచుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ల లోని బ్యాంకులన్నీ ప్రజల నుంచి ఎఫ్ డీలను ఆహ్వానిస్తాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఎఫ్ డీ పథకాలు, వాటికి ఇస్తున్న వడ్డీరేట్లను తెలుసుకుందాం..

SBI FD schemes: ఎస్బీఐ నుంచి బెస్ట్ ఎఫ్‌డీ స్కీమ్స్ ఇవే.. ఆ పథకానికి మాత్రం మార్చి నెలాఖరు డెడ్ లైన్
Sbi
Madhu
|

Updated on: Mar 11, 2024 | 2:09 PM

Share

సాధారణంగా మనందరికీ ఎక్కువగా తెలిసిన పొదుపు మార్గం ఫిక్స్ డ్ డిపాజిట్లు. వీటిలో సొమ్మును డిపాజిట్ (ఎఫ్ డీ) చేయడం ద్వారా నిర్ణీత కాలానికి వడ్డీతో కలిసి కొంత మొత్తం అందుతుంది. అయితే ఎఫ్ డీలపై అన్ని బ్యాంకులు ఒకే వడ్డీరేటు ఇవ్వవు. అందువల్లనే సురక్షితమైన బ్యాంకుతో పాటు, అధిక వడ్డీరేటు ఇచ్చే బ్యాంకులను ఎంచుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ల లోని బ్యాంకులన్నీ ప్రజల నుంచి ఎఫ్ డీలను ఆహ్వానిస్తాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఎఫ్ డీ పథకాలు, వాటికి ఇస్తున్న వడ్డీరేట్లను తెలుసుకుందాం..

అమృత్ కలాష్ స్పెషల్ ఎఫ్‌డీ..

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) నూతన ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు అమృత్ కలాష్ స్పెషల్ ఎఫ్‌డీ. ఇందులో వేసిన డిపాజిట్లకు సాధారణ ఎఫ్‌డీలకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు మంచి అవకాశం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టుబడి పెట్టడానికి ప్రజలను ఆహ్వానిస్తోంది. ఈ గడువును అనేక సార్లు పొడిగించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం మార్చి 31 వరకూ అవకాశం ఉంది. ఎస్ బీఐ ప్రవేశపెట్టిన ఈ పథకం సీనియర్ సిటీజన్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ఎఫ్ డీలపై వడ్డీ కంటే ఎక్కువగా ఇవ్వడం వీరికి ప్రయోజనం కలిగిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఈనెలాఖరు వరకూ మాత్రమే గడువు ఉంది. సమీపంలోని ఆ బ్యాంకు శాఖలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

వడ్డీ రేటు ఇలా.. అమృత్ కలాష్ ఎఫ్ డీ పథకంలో డిపాజిట్లకు వఢ్డీ రేటు అధికంగానే ఉంది. 400 రోజుల కాలవ్యవధికి చేసిన డిపాజిట్లపై సుమారు 7.10 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ వడ్డీ రేటు ఎస్ బీఐ సాధారణ ఎఫ్ డీ రేటు కంటే ఎక్కువ. సీనియర్ సిటిజన్లు సంవత్సరానికి 7.60 శాతం వడ్డీని పొందుతారు. ఈ పథకంలో సీనియర్ సిటిజన్ల తో పాటు మామూలు ఖాతాదారులు కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎస్బీఐ ఇతర పథకాలు..

అమృత్ కలాష్ ఎఫ్ డీతో పాటు మరికొన్ని ఇతర పథకాలను కూడా ఎస్ బీఐ అమలు చేస్తుంది. అవి కూడా ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

గ్రీన్ డిపాజిట్.. ఎస్ బీఐ గ్రీన్ డిపాజిట్ పథకం కూడా ఖాతాదారులకు అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడిదారులు 1,111 రోజులు, 1,777 రోజులు, 2,222 రోజుల సౌకర్యవంతమైన కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఈ పథకం బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉంది. ఇది త్వరలో యోనో మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు (ఐఎన్ బీ) వంటి ఇతర డిజిటల్ ఛానెళ్ల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఎస్బీఐ బెస్ట్.. ఈ డిపాజిట్ పథకం సాధారణ ఎఫ్ డీ కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇది రెండేళ్ల కాలపరిమితికి వేసిన డిపాజిట్లపై 7.4 శాతం, ఒక ఏడాది వ్యవధికి వేసిన డిపాజిట్లపై 7.10% రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ రేట్లపై అదనంగా మరి కొంత శాతం వడ్డీని పొందుతారు.

ఎస్బీఐ వీ కేర్.. సీనియర్ సిటిజన్ల కోసం 2020లో ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీనిలో జమ చేసిన ఎఫ్ డీలకు మరింత మెరుగైన వడ్డీ అందిస్తారు. సాధారణ కార్డ్ రేటుపై 0.5 శాతం అదనపు వడ్డీ చెల్లిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొండెక్కిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. అయ్యో.. కిలో ఎంతంటే..?
కొండెక్కిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. అయ్యో.. కిలో ఎంతంటే..?
బుగ్గ మల్లేశ్వర క్షేత్రం.. శివుడి పక్కనే గంగమ్మ కొలువైన అద్భుత..
బుగ్గ మల్లేశ్వర క్షేత్రం.. శివుడి పక్కనే గంగమ్మ కొలువైన అద్భుత..
భారత్ మండపంలో అంబరాన్ని అంటిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు
భారత్ మండపంలో అంబరాన్ని అంటిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు
ఇంట్లోనే గింజల ద్వారా తామర పూలను ఎలా పెంచాలి? గార్డెనింగ్ టిప్స్
ఇంట్లోనే గింజల ద్వారా తామర పూలను ఎలా పెంచాలి? గార్డెనింగ్ టిప్స్
ఒకే ఒక్క సినిమాతో ఆయన విలన్‌గా బాగా పాపులర్ అయ్యాడు..
ఒకే ఒక్క సినిమాతో ఆయన విలన్‌గా బాగా పాపులర్ అయ్యాడు..
ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ కట్ అయినా పెన్షన్ బంద్..
ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ కట్ అయినా పెన్షన్ బంద్..
ఓటమి అంచు నుంచి విజయ శిఖరాలకు.. భారత్‌ను గెలిపించిన మోహిత్
ఓటమి అంచు నుంచి విజయ శిఖరాలకు.. భారత్‌ను గెలిపించిన మోహిత్
సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కి..
సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కి..
అరటిపండు తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..? మీకు తెలియని నిజాల
అరటిపండు తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..? మీకు తెలియని నిజాల
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్‌ నియామకం
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్‌ నియామకం