Road Trip: లాంగ్ టూర్ వెళ్తున్నారా? మీ కారులో ఇవి ఉండాల్సిందే..
అలా కానీ పక్షంలో కుటుంబంగా ప్రత్యేకంగా ట్యాక్సీని మాట్లాడుకొంటున్నారు. అయితే అలా కార్లలో లాంగ్ టూర్లకు వెళ్లే వారు కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అది కుంటుంబంతో అయినా.. ఒంటరిగా వెళ్తున్నా సరే. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించుకోవడానికి మీరు కచ్చితంగా మీ కారులో ఉంచవలసిన కొన్ని వస్తువులు ఉన్నాయి.

దసరా సెలవులు సమీపించాయి. పిల్లలకు వారం పాటు సెలవులు వస్తాయి. ఈ సమయంలో ఎక్కడికైనా టూర్ వెళ్తే బావుండని అందరూ భావిస్తారు. ఇటీవల కాలంలో చాలా మంది సొంత కార్లను కలిగి ఉంటున్నారు. అందులో ఊర్లు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అలా కానీ పక్షంలో కుటుంబంగా ప్రత్యేకంగా ట్యాక్సీని మాట్లాడుకొంటున్నారు. అయితే అలా కార్లలో లాంగ్ టూర్లకు వెళ్లే వారు కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అది కుంటుంబంతో అయినా.. ఒంటరిగా వెళ్తున్నా సరే. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించుకోవడానికి మీరు కచ్చితంగా మీ కారులో ఉంచవలసిన కొన్ని వస్తువులు ఉన్నాయి. మీ ప్రయాణం ఎప్పటికీ మధురంగా మారిపోవాలనుకుంటే వీటిని తప్పనిసరిగా కారులో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి.
టైర్ ఇన్ ఫ్లేటర్..
మన దేశంలో జాతీయ రహదారుల పరిస్థితి ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడింది. అయితే వివిధ భూ భాగాల్లో ప్రయాణించాల్సి రావొచ్చు. కాబట్టి అన్ని చోట్ల మంచి రోడ్లే ఉంటాయని భావించకూడదు. రోడ్లు సవాలు భూభాగాలుగా మారినప్పుడు, టైర్లు పంక్చర్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో టైర్ ఇన్ ఫ్లేటర్ మీ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. మీకారుకు ట్యూబ్ లెస్ వీల్స్ ఉన్నట్లయితే వైర్లెస్ లేదా వైర్డు ఇన్ ఫ్లేటర్ ను మీ కారులోఉంచడం చాలా అవసరం. పంక్చర్ వల్ల తగ్గిపోయిన గాలని తిరిగి ఎక్కించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కనీసం మెకానిక్ వద్దకు వెళ్లే వరకూ అయినా కారు కదలడానికి ఇది మీకు ఉపకరిస్తుంది.
అత్యవసర టార్చ్.. దుప్పటి
కారుకు లైట్లు ఉంటాయి.. ఫోన్లో ఫ్లాష్ ఉంటుంది.. మరి ప్రత్యేకంగా టార్చ్ లైట్ ఎందుకు? కానీ అనుకోని పరిస్థితుల్లో బ్యాటరీ కూడా లో అయిన సందర్భంలో చీకటిగా ఉన్న సమయంలో ఈ టార్చ్ లైట్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితులో ఇది బాగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అదే సమయంలో ఓ దుప్పటి కూడా కారులో ఉంటే మంచిది. రాత్రి వేళ చల్లగా ఉంటే ఇది మీకు మంచి నిద్రను అందించేందుకు ఉపకరిస్తుంది.
పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్..
మురికి కారులో ఎక్కువ గంటలు గడపాలని ఎవరూ కోరుకోరు. అందుకే కారును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేందుకు పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్ బాగా ఉపకరిస్తుంది. టైర్ ఇన్ ప్లేటర్ లాగా, మీరు వైర్డు లేదా వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ ను కారులో స్పేర్ గా పెట్టుకోవాలి.
జీపీఎస్ ట్రాకింగ్ పరికరం/ఎయిర్ ట్యాగ్..
వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ పరికరం ఉండాలి. ఇది ప్రతిరోజూ మీ వాహనాన్ని తనిఖీ చేయడంలో మీకు సహాయపడటమే కాకుండా, పార్కింగ్ స్పాట్ల గురించి మీకు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అలాగే యాపిల్ ఎయిర్ ట్యాగ్ కూడా మీకు బాగా సహాయపడుతుంది. రిమోట్ ఏరియాల్లో ఇది మీకు బాగా ఉపకరిస్తుంది.
ప్రథమ చికిత్స కిట్..
ప్రతి వాహనంతో పాటు తయారీదారులు అందించిన ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని ఉంచుతారు. దీనిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. అందులో ఎప్పుడూ ఆ సామగ్రి ఉండేటట్లు చూసుకోవాలి. అన్ని మందులు, క్రీములు, బ్యాండేజీల ఎక్స్ పైరీ తేదీలను తనిఖీ చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




