IRCTC: సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించొచ్చు.. ఈ చిన్న ట్రిక్‌తో సాధ్యమే..
మీరు దేనికి రిజర్వేషన్ చేయించుకుంటే అదే కోచ్ ప్రయాణించాల్సి ఉంటుంది. సెకండ్ స్లీపర్ కు రిజర్వేషన్ చేయించుకుని ఏసీ క్లాసీ ప్రయాణించడం కుదరదు. అయితే ఇటీవల రైల్వే శాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. సెకండ్ స్లీపర్ రిజర్వేషన్ చేయించుకున్న వారికి థర్డ్ ఏసీ బోగీలో బెర్త్ పొందే అవకాశం ఇస్తోంది. ఇది ఎలా సాధ్యం? ఈ ప్రత్యేక సౌకర్యం రైల్వేలో ఎందుకు తీసుకొచ్చారు? అందుకు ఏం చేయాలి? తెలియాలంటే ఇది చదవండి.
మన దేశంలో అత్యధిక శాతం మంది వినియోగించే రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. అన్ని వర్గాల వారికి అందుబాటులో అనువుగా ప్రయాణ సాధనం ఇదొక్కటే. సాధారణంగా ఒక రైలులో జనరల్, సెకండ్ క్లాస్ స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి ప్రత్యేక కోచ్ లు ఉంటాయి. చాలా మంది కొన్ని నెలల ముందే రిజర్వేషన్లు సైతం చేసుకుంటారు. మీరు దేనికి రిజర్వేషన్ చేయించుకుంటే అదే కోచ్ ప్రయాణించాల్సి ఉంటుంది. సెకండ్ స్లీపర్ కు రిజర్వేషన్ చేయించుకుని ఏసీ క్లాసీ ప్రయాణించడం కుదరదు. అయితే ఇటీవల రైల్వే శాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. సెకండ్ స్లీపర్ రిజర్వేషన్ చేయించుకున్న వారికి థర్డ్ ఏసీ బోగీలో బెర్త్ పొందే అవకాశం ఇస్తోంది. ఇది ఎలా సాధ్యం? ఈ ప్రత్యేక సౌకర్యం రైల్వేలో ఎందుకు తీసుకొచ్చారు? అందుకు ఏం చేయాలి? తెలియాలంటే ఇది చదవండి.
ఆటో టికెట్ అప్‌గ్రేడేషన్..
రైల్వే శాఖ ఇటీవల ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరు ఆటో టికెట్ అప్‌గ్రేడేషన్. రైలులో సీటు ఖాళీగా ఉండకుండా భారతీయ రైల్వే తన సొంత ప్రయోజనం కోసం ఈ ఆటో టికెట్ అప్‌గ్రేడేషన్ పథకాన్ని ప్రారంభించింది. వాస్తవానికి, అనేక రైళ్లలో ఏసీ-వన్, రెండు లేదా మూడు వంటి ఉన్నత తరగతి కోచ్‌లలో చాలా సార్లు బెర్త్‌లు ఖాళీగా ఉంటాయి. దీంతో రైల్వేశాఖ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ నష్టాన్ని నివారించేందుకు, ఎగువ తరగతి కోచ్‌ల సౌకర్యాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు, రైల్వే ఈ ఆటో అప్‌గ్రేడేషన్ పథకాన్ని తీసుకొచ్చింది.
ఆటో అప్‌గ్రేడేషన్ ఎలా పనిచేస్తుందంటే..
ఒక ప్రయాణికుడు తీసుకున్న రైల్వే టికెట్ ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా, అతను ఆపై తరగతిలో బెర్త్ పొందుతాడు. అంటే ఎగువ తరగతిలో ఏదైనా బెర్త్ ఖాళీగా ఉంటే, కింద ఉన్న ప్రయాణికులను ఒక తరగతిని అప్‌గ్రేడ్ చేసి, ఆ తరగతిలో బెర్త్ అందిస్తారు. ఉదాహరణకు, రైలులోని ఏసీ ఫస్ట్ బోగీలో నాలుగు సీట్లు ఖాళీగా ఉంటే, సెకండ్ ఏసీ బోగీలో రెండు సీట్లు ఖాళీగా ఉంటే, సెకండ్ ఏసీలోని కొంతమంది ప్రయాణికుల టికెట్లు అప్‌గ్రేడ్ చేసి ఫస్ట్ ఏసీలో పెడతారు. అలాగే థర్డ్ ఏసీ ప్రయాణికులకు అప్‌గ్రేడ్ చేసి సెకండ్ ఏసీలో సీట్లు కేటాయిస్తారు.
ఇద్దరికీ ప్రయోజనం..
ఈ కొత్త పథకంతో అటు రైల్వేతో పాటు ఇటు ప్రయాణికులు మేలు పొందుతారు. ఎందుకంటే సెకండ్ క్లాస్ కు వెయింటింగ్ లిస్ట్ లో ఉన్న వారికి థర్డ్ ఏసీ టికెట్లు కొన్ని కేటాయిస్తారు. ఈ విధంగా, రైలులో ఏ రిజర్వ్ కోచ్ లోనూ బెర్త్ ఖాళీగా ఉండదు. రైల్వే నష్టాలు తగ్గడంతో పాటు ప్రయాణికులకు కూడా మేలు జరుగుతుంది. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలంటే, ప్రయాణికుడు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి.
టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఇలా చేయాలి..
ఐఆర్సీటీసీ సైట్ లేదా యాప్ నుంచి టికెట్ బుకింగ్ చేస్తున్నప్పుడు, మీరు ఆటో టికెట్ అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ను ఎంచుకోవలసి ఉంటుంది. ఇందులో అవును లేదా కాదు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. టికెట్ ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద అవును ఎంపికను టిక్ చేసే ప్రయాణీకులకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ప్రయాణికుడు బుకింగ్ సమయంలో అవును లేదా కాదు మధ్య ఏదైనా ఎంపికను ఎంచుకోకపోతే, సిస్టమ్ స్వయంచాలకంగా దానిని అవునుగా పరిగణిస్తుంది.
ఈ నిబంధనలు తెలుసుకోవాలి..
ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద బోగీ తరగతిని మార్చినప్పటికీ పీఎన్ఆర్ లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే ప్రయాణ టికెట్‌కు సంబంధించిన ఏ రకమైన సమాచారానికైనా అదే పీఎన్ఆర్ ని ఉపయోగించాలి. ఇది కాకుండా, అప్‌గ్రేడ్ చేసిన తర్వాత టికెట్ రద్దు అయితే అప్‌గ్రేడ్ చేసిన తరగతికి కాకుండా నిబంధనల ప్రకారం పాత ధరే తిరిగి చెల్లిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..