Housing loan interest rates: హౌసింగ్ రుణానికి ఇదే మంచి సమయం.. ఈ బ్యాంకులో అతి తక్కువ వడ్డీ
సొంత ఇల్లు కట్టుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా దానిలో ఉండాలనేది మీ కలా, ఆ కోరికే తీరే సమయంలో కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీ నిరీక్షణకు తెరదించేయండి. వెంటనే మీకు దగ్గరలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వెళ్లి హౌసింగ్ లోన్ (ఇంటి రుణం) కోసం దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నెల (జూన్) 50 బేసిస్ పాయింట్ల రెపోరేటు తగ్గించింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు వడ్డీలు గణనీయంగా తగ్గాయి. తక్కువ వడ్డీకే రుణాలను పొందే అవకాశం కలిగింది.

Housing Loan
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన అన్ని బ్యాంకులూ హౌసింగ్ రుణాాలను మంజూరు చేస్తాయి. కానీ అవి వసూలు చేసే వడ్డీరేట్లలో స్వల్ప తేడాలు ఉంటాయి. ఇటీవల ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంలో ఆ ప్రభావం బ్యాంకింగ్ రంగంపై పడింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి వాయిదాల మొత్తం తగ్గింది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి తక్కువ వడ్డీకే అందజేస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు రంగ బ్యాంకుల కన్నా ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు
- ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో హౌసింగ్ రుణంపై 8 నుంచి 9.20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.
- బ్యాంకు ఆఫ్ బరోడాలో రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల రుణానికి 8 నుంచి 9.65 శాతం వరకూ, రూ.75 లక్షలు పైగా తీసుకుంటే 9.90 శాతం వడ్డీ విధిస్తున్నారు.
- యూనియన్ బ్యాంకులో రూ.30 లక్షల వరకూ 7.85 నుంచి 10.25 వరకూ. అలాగే రూ.75 లక్షల వరకూ తీసుకుంటే 7.85 నుంచి 10.40 శాతం వడ్డీ చెల్లించాలి.
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.30 లక్షలకు రూ.7.55 నుంచి 9.35 శాతం వరకూ, ఆపై మొత్తానికి రూ.7.50 నుంచి 9.25 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.
- బ్యాంకు ఆఫ్ ఇండియాలో రూ.75 లక్షల వరకూ 7.85 నుంచి 10.35 శాతం వరకూ, ఆపై తీసుకున్న రుణానికి రూ.7.85 నుంచి 10.60 శాతం వసూలు చేస్తున్నారు.
- అత్యల్పంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.35 శాతం, యూకో, ఇండియన్ బ్యాంకు రూ.7.40 శాతం వడ్డీరేటు విధిస్తున్నాయి.
ప్రైవేటు రంగ బ్యాంకులు
- కోటక్ మహీంద్రా బ్యాంక్ లో రూ.8.65, ఐసీఐసీఐ బ్యాంకులో రూ.8.50 శాతం నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతున్నాయి.
- యాక్సిస్ బ్యాంకులో రూ.75 లక్షల వరకూ రుణానికి రూ.8.75 నుంచి 12.80 శాతం, ఆపై మొత్తానికి 8.75 నుంచి 9.65 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.
- హచ్ ఎస్బీసీలో 8.25, సౌత్ ఇండియన్ బ్యాంకులో 8.30, కరూర్ వైశ్యాబ్యాంకులో 8.45 శాతం వడ్డీ విధిస్తారు.
- కర్ణాటక బ్యాంకులో 8.62 శాతం, ఫెడరల్ బ్యాంకులో 9.15 శాతం, టీఎంబీలో 8.50 శాతం నుంచి వడ్డీరేట్లు మొదలవుతున్నాయి.
- అత్యల్పంగా హెచ్ఎస్బీసీ 8.25 శాతం, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులు 8.45 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి.








