PPF Account: ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా మంచి పథకం ఇది.. అధిక రాబడి.. పైగా పన్ను రాయితీ..

మీరు ఏదైనా స్థిర రాబడి వచ్చే పథకం కోసం వెతుకుతున్నారా? మంచి వడ్డీ రేటుతో పాటు డిపాజిట్ చేసిన డబ్బుకు భరోసా కూడా ఉండాలని భావిస్తున్నారా? విత్ డ్రా సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మంది విశ్వసించే, అధిక రాబడి అందించే స్కీమ్ ఒకటి ఉంది. అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్). దీనిలో స్థిరమైన రాబడి వస్తుంది.

PPF Account: ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా మంచి పథకం ఇది.. అధిక రాబడి.. పైగా పన్ను రాయితీ..
Ppf
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Dec 08, 2023 | 9:05 PM

మీరు ఏదైనా స్థిర రాబడి వచ్చే పథకం కోసం వెతుకుతున్నారా? మంచి వడ్డీ రేటుతో పాటు డిపాజిట్ చేసిన డబ్బుకు భరోసా కూడా ఉండాలని భావిస్తున్నారా? విత్ డ్రా సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మంది విశ్వసించే, అధిక రాబడి అందించే స్కీమ్ ఒకటి ఉంది. అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్). దీనిలో స్థిరమైన రాబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని మార్కెట్ డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఆదాయం వస్తుంది. మరికొన్ని స్థిరమైన రాబడిని అందిస్తాయి. ఇంకొన్ని లాక్-ఇన్ పీరియడ్ కలిగి ఉంటాయి. చాలా తక్కువ మాత్రమే ఓపెన్-ఎండ్ కలిగి ఉంటాయి. అలాంటి ఉత్తమ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఈ నేపథ్యంలో ఈ పీపీఎఫ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..

పీపీఎఫ్ చిన్న పొదుపు పథకం(స్మాల్ సేవింగ్ స్కీమ్) కిందకు వస్తుంది. వీటిలో వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షించబడతాయి. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ-మద్దతు గల పొదుపు పథకాలలో ఒకటి. పీపీఎఫ్ అనేది సార్వభౌమ హామీతో వచ్చే దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక. సాధారణంగా ఫిక్స్ డ్ డిపాజిట్లలో లభించే రిటర్న్‌ల కంటే ఎక్కువ ఇందులో వస్తుంది. ఈ పీపీఎఫ్ పథకం సామాన్యులకు అనేక ప్రయోజనాలతో పవర్-ప్యాక్ చేసి ఉంటుంది. మీరు దీర్ఘకాలంలో సంపదను కూడబెట్టుకోవాలని ఆలోచిస్తుంటే ఈ పీపీఎఫ్ మీకు బెస్ట్ ఆప్షన్ కాగలదు.

పీపీఎఫ్ ఫీచర్స్..

ఇన్వెస్టర్లు తమ పీపీఎఫ్ ఖాతాల్లో సంవత్సరానికి రూ. 500 నుంచి, ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, పెట్టుబడిదారులు తమ డబ్బును తమ పీపీఎఫ్ ఖాతాలో వరుసగా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, 15 సంవత్సరాల చివరిలో ఒకరికి డబ్బు అవసరం లేకపోతే, అతను లేదా ఆమె పీపీఎఫ్ ఖాతా పదవీకాలాన్ని అవసరమైనన్ని సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. పీపీఎఫ్ ఖాతా పొడిగింపు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా ఐదేళ్ల బ్లాక్‌లలో దీన్ని చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

పన్ను ఆదా.. ‘ఈఈఈ’ ఫీచర్‌తో ప్రజలకు పన్నులను ఆదా చేయడానికి ఒక ఎంపికను అందించే అతి కొద్ది పథకాలలో పీపీఎఫ్ కూడా ఒకటి, అంటే ఇది పూర్తిగా పన్ను రహిత పొదుపు ఎంపిక. అసలు, లాభం, ఉపసంహరణపై సేకరించిన మొత్తంపై పన్ను విధించరు.

ఎవరు ప్రారంభించొచ్చు.. భారతీయ నివాసి అయిన ప్రతిఒక్క వయోజన వ్యక్తి కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. అదే సమయంలో మైనర్ అయిన వ్యక్తి తరఫున సంరక్షకుడు కూడా పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టవచ్చు.

పీపీఎఫ్ వడ్డీ రేట్లు.. ప్రభుత్వం పీపీఎఫ్‌పై వార్షిక వడ్డీ రేట్లను 7.1 శాతంగా నిర్ణయించింది.

విత్‌డ్రా ఎలా అంటే..

  • ప్రీ మెచ్యూర్ విత్ డ్రాల్స్ చేయాలంటే ఖాతా తెరచిన ఐదేళ్ల తర్వాత సాధ్యమవుతుంది. అది కూడా ఖాతా తెరిచిన సంవత్సరాన్ని లెక్కలోకి తీసుకోరు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. నాల్గవ సంవత్సరం చివరిలో ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో 50 శాతం మాత్రమే లేదా లేదా అంతకు ముందు సంవత్సరం చివరిలో ఉన్న మొత్తంలో 50శాతం ఏది తక్కువైతే అది విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • 15 సంవత్సరాల తర్వాత, పీపీఎఫ్ సబ్‌స్క్రైబర్ సంబంధిత పోస్ట్ ఆఫీస్‌లో పాస్‌బుక్‌తో పాటు ఖాతా మూసివేత ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మెచ్యూరిటీ చెల్లింపును తీసుకుంటారు.
  • అతను లేదా ఆమె అతని/ఆమె ఖాతాలో మెచ్యూరిటీ విలువను డిపాజిట్ లేకుండానే కొనసాగించవచ్చు. ఈ సందర్భంలో, పీపీఎఫ్ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, చందాదారుడు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక ఉపసంహరణను తీసుకోవచ్చు.
  • సంబంధిత పోస్టాఫీసు వద్ద సూచించిన పొడిగింపు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా సబ్‌స్క్రైబర్ అతని/ఆమె ఖాతాను మరో ఐదేళ్లకు పొడిగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!