SBI Salary Account: మీకు శాలరీ అకౌంట్ ఉందా? దానితో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
బ్యాంకు ఖాతాలలో శాలరీ ప్యాకేజీ ఖాతాలు వేరుగా ఉంటాయి. ప్రతినెలా జీతం వచ్చే ఉద్యోగులకు వీటిని ప్రారంభిస్తారు. మూమూలు ఖాతాదారులతో పోల్చితే వీరికి కొన్ని అదనపు ప్రయోజనాలు కల్పిస్తారు. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కూడా ఈ ఖాతాలను అందజేస్తుంది. దానిలో ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం..

సాధారణంగా అందరికీ వివిధ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి. వాటి నుంచి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఆన్ లైన్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు తీసుకుంటున్నారు. వివిధ ప్రభుత్వం పథకాల సొమ్ములు కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకే జమవుతున్నాయి. బ్యాంకుల నిబంధనల ప్రకారం ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచాలి. అలాగే ఏటీఎమ్ తదితర వాటికి నిర్వహణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
శాలరీ ప్యాకేజీ ఖాతాలు..
బ్యాంకు ఖాతాలలో శాలరీ ప్యాకేజీ ఖాతాలు వేరుగా ఉంటాయి. ప్రతినెలా జీతం వచ్చే ఉద్యోగులకు వీటిని ప్రారంభిస్తారు. మూమూలు ఖాతాదారులతో పోల్చితే వీరికి కొన్ని అదనపు ప్రయోజనాలు కల్పిస్తారు. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కూడా ఈ ఖాతాలను అందజేస్తుంది. దానిలో ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం..
ఉద్యోగస్తుల కోసం..
ఉద్యోగస్తుల బ్యాంకింగ్ అవసరాలను తీర్చడం కోసం శాలరీ ప్యాకేజీ ఖాతాలను రూపొందించారు. వీటి ద్వారా ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించడంతో పాటు వివిధ ప్రయోజనాలను అందజేస్తారు. మీరు ఎస్ బీఐలో శాలరీ ఖాతా ప్రారంభించాలనుకుంటే ముందుగా ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా నేరుగా బ్యాంక్‌కు అధికారులను కలవొచ్చు. వీడియో కస్టమర్ గుర్తింపు ప్రక్రియ ద్వారా యోనో అప్లికేషన్‌లో జీతం ప్యాకేజీ ఖాతాను తెరవవచ్చు.
ప్రయోజనాలు ఇవే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజీ ఖాతాలను అందజేస్తుంది. వాటి వల్ల ఖాతాదారులకు ఈ కింద తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
- ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా
- నెలవారీ బ్యాలెన్స్ చార్జీలు ఉండవు
- ఆటో స్వీప్ సౌకర్యం (ఐచ్ఛికం)
- ప్రత్యేకప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డ్
- దేశంలోని ఎస్ బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమిత లావాదేవీలు
- డిమాండ్ డ్రాఫ్ట్‌పై జారీ ఛార్జీల మినహాయింపు
- నెలకు 25 వరకు మల్టీ సిటీ చెక్‌ల జారీ ఛార్జీల మినహాయింపు
- ఆన్‌లైన్ ఆర్టీజీఎస్ /ఎన్ఈఎఫ్టీ చార్జీల మినహాయింపు
- కాంప్లిమెంటరీ పర్సనల్/ ఎయిర్ యాక్సిడెంటల్ బీమా
- వ్యక్తిగత, కారు రుణాల మంజూరు
- అర్హత ప్రకారం ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం
- వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ
ఎస్ బీఐ అందించే శాలరీ ప్యాకేజీలు..
- కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ (సీజీఎస్పీ)
- రాష్ట్ర ప్రభుత్వ వేతన ప్యాకేజీ (ఎస్జీఎస్పీ)
- రైల్వే జీతం ప్యాకేజీ (ఆర్ఎస్పీ)
- డిఫెన్స్ జీతం ప్యాకేజీ (డీఎస్పీ)
- సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ (సీఏపీఎస్ఫీ)
- పోలీసు జీతాల ప్యాకేజీ (పీఎస్పీ)
- ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ (ఐసీజీఎస్పీ)
- కార్పొరేట్ జీతం ప్యాకేజీ (సీఎస్పీ)
- ప్రారంభ జీతం ప్యాకేజీ ఖాతా (ఎస్ యూఎస్పీ)
ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..
- పాస్ పోర్ట్ సైజు ఫొటో
- పాన్ కార్డ్
- చిరునామా రుజువు
- ఉపాధి / సేవా ధృవీకరణ పత్రం
- తాజా జీతం స్లిప్
- ఉమ్మడి ఖాతా కోసం ఇద్దరికీ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు అవసరం.
పొదుపు ఖాతాలను మార్చుకునే అవకాశం..
ఎస్ బీఐలో ఇప్పటికే ఉన్న పొదుపు ఖాతాలను శాలరీ ఖాతాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకు ఉపాధి రుజువు, జీతం స్లిప్/సర్వీస్ సర్టిఫికెట్ ను బ్యాంకు లో అందజేయాలి. శాలరీ ఖాతాకు వరుసగా మూడు నెలల పాటు జీతం జమ కాకుంటే దానిని సాధారణ పొదుపు ఖాతా కింద పరిగణిస్తారు. వాటికి అనుగుణంగా అన్ని చార్జీలు విధిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




