Ather Rizta vs TVS iQube: బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ ఏది? రెండే ఆప్షన్లు.. ఒకటి ఎంపిక చేసుకోవాలంటే ఇది చదవాల్సిందే..
అనేక కంపెనీలు మార్కెట్లో ఉన్నా.. ఫ్యామిలీ స్కూటర్‌గా మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ అధిక ఆదరణ పొందుతోంది. ఎందుకంటే దాని కొలతలు, అధిక బూట్ స్పేస్, దాని స్నేహపూర్వక పనితీరు కారణంగా కంప్లీట్ ఫ్యామిలీ స్కూటర్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఫ్యామిలీ వినియోగదారులే లక్ష్యంగా ఏథర్ ఎనర్జీ కంపెనీ కూడా ఓ కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరు ఏథర్ రిజ్టా.

మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అందరూ వీటిని వినియోగిస్తున్నారు. అలాగే యువకులు, వృద్ధులు కూడా వాటిలోని అత్యాధునిక ఫీచర్లతో మొగ్గుచూపుతున్నారు. అనేక కంపెనీలు మార్కెట్లో ఉన్నా.. ఫ్యామిలీ స్కూటర్‌గా మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ అధిక ఆదరణ పొందుతోంది. ఎందుకంటే దాని కొలతలు, అధిక బూట్ స్పేస్, దాని స్నేహపూర్వక పనితీరు కారణంగా కంప్లీట్ ఫ్యామిలీ స్కూటర్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఫ్యామిలీ వినియోగదారులే లక్ష్యంగా ఏథర్ ఎనర్జీ కంపెనీ కూడా ఓ కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరు ఏథర్ రిజ్టా. ఈ క్రమంలో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్డా మధ్యన పోలీకలేంటి? తేడాలేంటి? మార్పులేంటి? ఫీచర్లేంటి? స్పెసిఫికేషన్లు ఏంటి? తెలుసుకుందాం రండి..
ఏథర్ రిజ్టా వర్సెస్ టీవీఎస్ ఐక్యూబ్: బ్యాటరీ సామర్థ్యం
- ఏథర్ రిజ్టా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది, 2.9kWh యూనిట్, 3.7kWh యూనిట్. మొదటిది 123కిలోమీటర్లరేంజ్ ఇస్తుంది. అదే సమయంలో పెద్ద యూనిట్ 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఈ రిజ్టా గరిష్టంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను ఆరు గంటల 40 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు, అయితే పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల 30 నిమిషాలు పడుతుంది.
- టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఆఫర్‌లో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి, అవి 4.5kWh యూనిట్, 3kWh. మొదటిది క్లెయిమ్ చేస్తున్న వాస్తవ పరిధి 145కిలోమీటర్లు. ఇది గంటకు గరిష్టంగా 82కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెండోవేరియంట్ అంటే పెద్ద మోడల్ 100కిలోమీటర్ల రేంజ్ నుకలిగి ఉంటుంది.గరిష్టంగా గంటకు 78కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఏథర్ రిజ్డా వర్సెస్ టీవీఎస్ ఐక్యూబ్: ఫీచర్లు
- ఏథర్ రిజ్టా ఫీచర్లను పరిశీలస్తే.. వేరియంట్, ఫోన్ కనెక్టివిటీ, ఫాల్-సేఫ్ ఫంక్షన్, స్కిడ్ కంట్రోల్, హిల్ హోల్డ్, మ్యాజిక్ ట్విస్ట్ ఫంక్షన్, రెండు రైడ్ మోడ్‌లు, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి వాటిపై ఆధారపడి టీఎఫ్‌టీ డ్యాష్బోర్డ్ లేదా ఎల్‌సీడీ వంటి 450 సిరీస్ అందించే ప్రతిదీ ఇందులో ఉంది. 56 లీటర్ల నిల్వ స్థలంకూడా ఉంటుంది. అలాగే హార్డ్‌వేర్ విషయానికొస్తే, రిజ్టాకు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్, వెనుకవైపు మోనోషాక్ అబ్జర్బర్లను కలిగి ఉన్నాయి.
- టీవీఎస్ ఐక్యూబ్‌ను పరిశీలిస్తే.. ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్‌లు, జియో-ఫెన్సింగ్ వంటి మరెన్నో కనెక్టివిటీ ఎంపికలను అందించేందుకు టీఎఫ్టీ డ్యాష్ బోర్డును పొందుతుంది. రిజ్టా మాదిరిగానే, ఐక్యూబ్ కూడా రెండు రైడ్ మోడ్‌లను, వాయిస్ అసిస్టెన్స్‌తో సహా చాలా ఫీచర్లను పొందుతుంది. మొత్తం మీద, రెండు స్కూటర్లు మంచి ఎంపికలు, అయినప్పటికీ, రిజ్టా కొంచెం ఎక్కువ ఆఫర్ చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




