Electric Cars: చార్జింగ్ పెట్టకుండానే క్షణాల్లో ఫుల్ బ్యాటరీ.. ఎక్కువ మైలేజ్ వచ్చేలా ఎలక్ట్రిక్ కార్ల తయారీ.. ఎలాగంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. భారత్‎లో కూడా దాదాపుగా టు వీలర్ మార్కెట్లో 20 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఇక ఎలక్ట్రిక్ కార్లలో కూడా మార్కెట్ వాటా అనుకున్న దానికంటే బాగా పెరుగుతుంది. కొత్త కార్ కొనుక్కోవాలనే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ కార్ గురించి ఆలోచిస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ఎంక్వయిరీలు కూడా పెద్ద ఎత్తున షోరూమ్లకు వస్తూ ఉన్నాయి. కానీ చాలామంది సాంప్రదాయ ఇంధన కార్ల వైపుకు ముగ్గు చూపడానికి కారణం బ్యాటరీ చార్జింగ్.

Electric Cars: చార్జింగ్ పెట్టకుండానే క్షణాల్లో ఫుల్ బ్యాటరీ.. ఎక్కువ మైలేజ్ వచ్చేలా ఎలక్ట్రిక్ కార్ల తయారీ.. ఎలాగంటే..
Electric Cars
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 13, 2024 | 9:40 AM

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. భారత్‎లో కూడా దాదాపుగా టు వీలర్ మార్కెట్లో 20 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఇక ఎలక్ట్రిక్ కార్లలో కూడా మార్కెట్ వాటా అనుకున్న దానికంటే బాగా పెరుగుతుంది. కొత్త కార్ కొనుక్కోవాలనే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ కార్ గురించి ఆలోచిస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ఎంక్వయిరీలు కూడా పెద్ద ఎత్తున షోరూమ్లకు వస్తూ ఉన్నాయి. కానీ చాలామంది సాంప్రదాయ ఇంధన కార్ల వైపుకు ముగ్గు చూపడానికి కారణం బ్యాటరీ చార్జింగ్. చాలామంది అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లకు ఇంటి దగ్గరే చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉండడం లేదు. మరోవైపు ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ 400 కిలోమీటర్ల దాటి లేదు. దూర ప్రయాణాలు చేయాలన్నా.. కనీసం రాష్ట్రంలోనే ఇంకో నగరానికి వెళ్లి రావాలన్నా ఇది సరిపోదు. ఇప్పుడిప్పుడే చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నా.. అవసరానికి సరిపడా అయితే లేవు. ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్లో కారును చార్జ్ చేసుకుందామన్నా మినిమం గంటన్నర అక్కడే ఉండాలి. ఎలక్ట్రిక్ కార్లతో ఫ్యూయల్ సేవింగ్ ఉన్నప్పటికీ.. ఈ ఇబ్బందులతో వినియోగదారులు కొంత వెనుకంజ వేస్తున్నారు.

దీంతో భారీగా ఎలక్ట్రిక్ వెహికల్స్‎ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీలన్నీ భవిష్యత్తులో చార్జింగ్ ఇబ్బంది లేకుండా ఉండేలా వ్యూహాన్ని సిద్ధం చేశాయి. సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్న కంపెనీల అసోసియేషన్. ఇప్పుడు ఎలా అయితే అన్ని ఫోన్లకు సి పిన్ పోర్టును ఉండాలని ఏకీకృత విధానం తేవడం ద్వారా.. మొబైల్ వినియోదారులకు భారం తగ్గడంతో పాటు పర్యావరణానికి కొంత మేలు చేకూరింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్న కంపెనీలను ఒకే రకం బ్యాటరీలు వాడాలనేది ఇకనుంచి అందుబాటులోకి రానున్న కొత్త నిబంధన. దీంతో బ్లేడ్ టెక్నాలజీతో రూపొందించే బ్యాటరీని అన్ని కార్లు వినియోగిస్తాయి. అంతేకాదు ఈ బ్యాటరీలన్నీ రిమూవబుల్ పద్ధతిలో ఫిక్స్ చేస్తారు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బ్యాటరీ‎ని బయటకు తీయొచ్చు. ఇక చార్జింగ్ స్టేషన్లో కూడా ఫుల్ ఛార్జ్ పెట్టిన ఈ రిమూవబుల్ బ్యాటరీస్ అందుబాటులో ఉంటాయి. మన కారు చార్జింగ్ అయిపోయిన వెంటనే దగ్గరలో ఉన్న చార్జింగ్ స్వైపింగ్ స్టేషన్‎కి వెళ్తే ఒకటి రెండు నిమిషాల్లోనే మన బ్యాటరీ తీసి ఫుల్ ఛార్జ్ చేసిన బ్యాటరీని ఫిక్స్ చేస్తారు.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల కూడా చిన్న చిన్న మార్పులతో ఈ టెక్నాలజీని వినియోగించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు బ్యాటరీని రిమూవ్ చేయకుండానే చార్జింగ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పటికే అందుబాటులో ఉన్న టర్బో చార్జర్స్‎తో స్పీడ్ చార్జింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ బంక్‎లోకి వెళ్లి పెట్రోల్ కొట్టించుకున్నంత ఈజీగా మీ కారు బ్యాటరీ కూడా మార్చుకోవచ్చు. దీంతోపాటే ఇప్పుడున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ రేంజ్‎ని 400 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు తీసుకెళ్లే విధంగా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. బ్యాటరీ కెపాసిటీని పెంచడం దాంతోపాటే బ్యాటరీ బరువును తగ్గించడం ఈ రెండు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీకి సవాల్‎గా మారనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..