తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు.. రూట్లు ఇవే.!

11-05-2024

Ravi Kiran

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రజాదరణ బాగా లభిస్తోంది. ఇతర రైళ్ల కంటే వీటికే ప్రాధాన్యత పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో రైల్వేశాఖ కొత్తగా వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి తేనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్‌ హిట్టు..

వందేభారత్‌ రైళ్లు ఇప్పటి వరకు కేవలం ఉదయం మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. టికెట్ ధరలు కూడా ఎక్కువే. కానీ వందేభారత్ స్లీపర్ రైళ్లు దూరం మార్గాలకు.. అలాగే అనువుగా బడ్జెట్‌కు అందుబాటులో ఉండే టికెట్ ధరలతో వస్తోంది. 

జూలైలో వందేభారత్ స్లీపర్ రైళ్లు 

తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలును దిల్లీ-ముంబయిల మధ్య ప్రారంభించనున్నారు.అలాగే తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ - పూణే,  విశాఖ - భువనేశ్వర్ మధ్య వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రతిపాదిస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో రూట్లు ఇవే

వందే భారత్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయట. వీటిలో 11 ఏసీ 3 టైర్, నాలుగు ఏసీ 2 టైర్, రెండు ఏసీ ఫస్ట్ కోచ్ ఉంటుంది. ఒకేసారి 823 మంది ప్రయాణికులు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ 3 టైర్‌లో 611, ఏసీ 2 టైర్‌లో 188 మంది, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 మంది ఉంటారు.

వందేభారత్ స్లీపర్ ఫీచర్లు ఇవే

అత్యధికులు ప్రయాణించే ఏసీ 3 టైర్‌లో అత్యాధునిక సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లోని బెర్తుల్లో ఎక్స్ట్రా కుషన్ ఏర్పాటు చేస్తు్నారు. రాజధాని కంటే మెరుగ్గా బెర్తులను సిద్ధం చేస్తున్నారు.

ఏసీ 3 టైర్‌లో అత్యాధునిక సౌకర్యాలు

ఇవి సెమీ హైస్పీడ్ రైళ్లు కావడంతో గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే శాఖ చెబుతోంది. ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చాక రాత్రి ప్రయాణాల సమయం చాలా వరకూ తగ్గుతుందని రైల్వే శాఖ చెబుతోంది.

వందేభారత్ స్లీపర్ వేగం