తెలుగు రాష్ట్రాల్లో జియో దూకుడు.. రికార్డు స్థాయిలో వినియోగదారులు

10 May 2024

TV9 Telugu

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో.. తెలుగు రాష్ర్టాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతోంది.

రిలయన్స్‌ జియో

రిలయన్స్‌ జియో ఇతర టెలికం కంపెనీలకు పోటీగా తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ మరింత ఆకట్టుకుంటోంది.

టెలికం కంపెనీలకు పోటీగా

రిలయన్స్‌ జియో తనదైన శైలిలో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌, ఫైబర్‌ నెట్‌లను ప్రవేశపెడుతూ లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది.

రీఛార్జ్‌ ప్లాన్స్‌

టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో రిలయన్స్‌ జియో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.

ట్రాయ్‌ నివేదికలు

విడుదల చేసిన నివేదికల ప్రకారం.. మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో 1.06 లక్షల మంది కస్టమర్లు జియో నెట్‌వర్క్‌ను ఎంచుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో..

దీంతో జియో వినియోగదారుల సంఖ్య 3.27 కోట్లకు చేరుకున్నారు. మరోవైపు, తన పోటీ సంస్థయైన ఎయిర్‌టెల్‌ 97 వేల మంది జత అయ్యారు.

కొత్త వినియోగదారులు

ఇక ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను 15, 432 మంది ఎంచుకున్నారు. కానీ, వొడాఫోన్‌ ఐడియా మాత్రం 48, 690 మంది కస్టమర్లను కోల్పోయింది. 

బీఎస్‌ఎన్‌ఎల్‌

అలాగే మార్చి నెలలో దేశవ్యాప్తంగా జియో కొత్తగా 21.43 లక్షల మంది చేరారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 46.97 కోట్లకు చేరుకున్నారు.

మార్చి నెలలో