AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund KYC: మ్యూచువల్ ఫండ్‌లో అసంపూర్తిగా ఉన్న కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?

మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి వచ్చిన ఈమెయిల్ రాహుల్‌ను కలవరపెడుతోంది. రాహుల్ KYC (నో యువర్ కస్టమర్) అసంపూర్తిగా ఉందని కంపెనీ ఇమెయిల్ పేర్కొంది. దీని కారణంగా అతను తన మ్యూచువల్ ఫండ్ నుంచి డబ్బును తీసుకోలేడు. బ్రోకర్‌తో మాట్లాడిన తర్వాత, KYC కోసం ఉపయోగించిన పత్రాలు ఇకపై అధికారిక పత్రాలుగా చెల్లుబాటు కాదని తెలుసుకున్నాడు .ఇది రాహుల్ సమస్య మాత్రమే కాదు..

Mutual Fund KYC: మ్యూచువల్ ఫండ్‌లో అసంపూర్తిగా ఉన్న కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?
Mutual Fund Kyc
Subhash Goud
|

Updated on: May 11, 2024 | 8:29 PM

Share

మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి వచ్చిన ఈమెయిల్ రాహుల్‌ను కలవరపెడుతోంది. రాహుల్ KYC (నో యువర్ కస్టమర్) అసంపూర్తిగా ఉందని కంపెనీ ఇమెయిల్ పేర్కొంది. దీని కారణంగా అతను తన మ్యూచువల్ ఫండ్ నుంచి డబ్బును తీసుకోలేడు. బ్రోకర్‌తో మాట్లాడిన తర్వాత, KYC కోసం ఉపయోగించిన పత్రాలు ఇకపై అధికారిక పత్రాలుగా చెల్లుబాటు కాదని తెలుసుకున్నాడు .ఇది రాహుల్ సమస్య మాత్రమే కాదు.. కేవైసీకి సంబంధించిన నియమాలలో మార్పుల కారణంగా దాదాపు 1.3 కోట్ల మంది ప్రజలు KYC సమస్యను ఎదుర్కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో కేవైసీకి సంబంధించిన కొత్త నియమాలు ఏమిటి? పెట్టుబడిదారులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు?

మీ కేవైసీ స్టేటస్‌ని ఎలా తెలుసుకోవాలి? అసంపూర్తిగా ఉన్న కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల PAN, పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID వంటి సమాచారాన్ని ధృవీకరించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI, KYC రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు(KRA)లను కోరింది. రెగ్యులేటర్ ఉద్దేశము ఏమిటంటే, ఆదాయపు పన్ను,ఆధార్ కార్డ్ వంటి అధికారిక డేటాబేస్‌లతో పెట్టుబడిదారుల రికార్డులను సరిపోల్చడం. పాన్, ఆధార్‌కు బదులుగా ఇతర పత్రాల ద్వారా కేవైసీ చేసిన పాత పెట్టుబడిదారుల రికార్డులు చెల్లుబాటు కాలేదని దర్యాప్తులో వెల్లడైంది. రాహుల్ వంటి కేవైసీ చెల్లుబాటు కాని పెట్టుబడిదారుల కోసం వారి మ్యూచువల్ ఫండ్ ఖాతా లను హోల్డ్‌ చేశారు. అటువంటి పెట్టుబడిదారుల ప్రస్తుత సిప్‌ కొనసాగవచ్చు. కానీ వారు తమ యూనిట్లను రీడీమ్ చేయలేరు. లేదా వారు కొత్త సిప్‌ని ప్రారంభించలేరు.

ఈ పెట్టుబడిదారులు వారి కేవైసీని అప్‌డేట్ చేయాలి

కేవైసీని అప్‌డేట్ చేసే ప్రక్రియ చాలా తేలికగా అనిపించినప్పటికీ.. ఈ పనిని పూర్తి చేయడానికి పెట్టుబడిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడిదారులు SEBI నియమించిన కేవైసీ నమోదు ఏజెన్సీకి అవసరమైన పత్రాలను సమర్పించినకూడా ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీ కేవైసీ స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలి? నిబంధనల మార్పు తర్వాత మీరు మీ KYCని అప్‌డేట్ చేయాల్సి ఉంటుందా? మ్యూచువల్ ఫండ్ కేవైసీని మీరు మొదట్లో ఎలా చేసారు? అనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది. కేవైసీ స్టేటస్ ని తనిఖీ చేయడం ద్వారా మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కేవైసీ ఆన్‌లైన్‌ స్టేటస్‌ని తెలుసుకోవడానికి, మీరు www.cvlkra.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి… తర్వాత KYC విచారణపై క్లిక్ చేసి, మీ పాన్ నంబర్‌ను సమర్పించండి.

దీనితో మీరు KYC స్టేటస్ గురించి తెలుసుకుంటారు. దీనిలో మీరు కేవైసీకి సంబంధించి ఆన్ హోల్డ్, రిజిస్టర్డ్, వాలిడేట్, రిజెక్టెడ్ వంటి నాలుగు ఎంపికలను చూస్తారు. దీనిలో మీ కేవైసీని ఏ KRA నిర్వహిస్తుందో కూడా మీకు తెలియజేస్తుంది. కేవైసీ స్టేటస్ హోల్డ్‌లో ఉంటే లేదా తిరస్కరించబడితే, మీరు కేవైసీని కొత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

దీని తర్వాత మాత్రమే మీరు మీ పెట్టుబడిని రీడీమ్ చేసుకోగలరు లేదా కొత్త పెట్టుబడిని ప్రారంభించగలరు. సెబీ కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు మీరు ఎంచుకున్న నిర్దిష్ట పత్రాలను ఉపయోగించి మాత్రమే కొత్త కేవైసీని పూర్తి చేయవచ్చు. ఇంతకు ముందు కేవైసీ కోసం బ్యాంక్ స్టేట్‌మెంట్, విద్యుత్, నీటి వినియోగ బిల్లులను ఉపయోగించవచ్చు. కానీ ఇప్పుడు ఈ పత్రాలు చెల్లవు. ఇప్పుడు కేవైసీని ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ , ఓటర్ ID కార్డ్ వంటి పత్రాలను ఉపయోగించి మాత్రమే కొత్త కేవైసీని పూర్తి చేయవచ్చు. రాహుల్ ఇంతకు ముందు బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా యుటిలిటీ బిల్లు ద్వారా కేవైసీని పూర్తి చేసి ఉంటే, అతను కొత్త కేవైసీ ప్రక్రియను ఆఫ్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

దీని కోసం వారు తమ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి లేదా ఫండ్ హౌస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. చెల్లుబాటు అయ్యే పత్రాల ద్వారా కేవైసీ పూర్తి చేసిన వారు ఆధార్ ధృవీకరణ ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. దీని కోసం మీరు మీ సంబంధిత KRA వెబ్‌సైట్‌కి వెళ్లి ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. సెబీ ప్రకారం, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ , ఓటర్ ID కూడా మ్యూచువల్ ఫండ్ కేవైసీ కోసం చెల్లుబాటు అయ్యే పత్రాలు.. కానీ వీటి ద్వారా పెట్టుబడిదారుల కేవైసీ ప్రక్రియ పూర్తి కావడం లేదు. KRAలు పాస్‌పోర్ట్ , ఓటర్ IDని ఉపయోగించి డేటాను ధృవీకరించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. డేటా వెరిఫికేషన్ లేకుండా, మీ KYC ప్రాసెస్ పూర్తి చేయడం సాధ్యం కాదు.. మీరు ఆధార్‌ను ఉపయోగిస్తే, పాన్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని ధృవీకరించడం సులభం అవుతుంది. అటువంటి సందర్భంలో, మీ KYC ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు