అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి ఏ సమయంలో కొనాలో తెలుసా?
Jyothi Gadda
08 May 2024
అక్షయ తృతీయను వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజుని ఎంతో ముఖ్యమైనదిగా, పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నారు.
జానికి, ఇప్పుడు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు కానీ... ఈ రోజున గృహ ప్రవేశం, కొత్త వ్యాపారం లాంటివి మొదలుపెట్టవచ్చు. వివాహం లాంటి శుభకార్యాలు కూడా చేసుకోవచ్చట. అంతటి మంచి రోజు ఈ అక్షయ తృతీయ.
అక్షయ అంటేనే నాశనం లేనిది.. అంతులేనిది.. తరిగిపోనిది అని అర్థం వస్తుంది. అందుకే ఇలాంటి పవిత్రమైన సందర్భంలో అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనుగోలు చేస్తే అది రెట్టింపు అవుతుందని విశ్వసిస్తుంటారు. అందుకే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు.
2024 సంవత్సరంలో అక్షయ తృతీయ మే 10న ఉదయం 4.17 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది మే 11న (మరుసటి రోజు) తెల్లవారుజామున 2.50 గంటలకు ముగుస్తుంది. పూజా ముహూర్తం ఉదయం 5.33 గంటల నుంచి మధ్యాహ్నం 12.18 గంటల వరకు ఉంది.
ఇక అక్షయ తృతీయ రోజున బంగారం ఏ సమయంలో కొనాలనేది కూడా ఉంటుంది. 2024, మే 10 తెల్లవారుజాము 5.33 నుంచి మే 11న ఉదయం 2.50 గంటలుగా ఉంది. పురాణ గాథల ప్రకారం.. ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది.
త్రేతా యుగం ఇదే రోజు ప్రారంభమైందని అంటుంటారు. పార్వతీ దేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది ఇదే రోజని పండితులు చెబుతుంటారు. ఆ రోజున బంగారం ఇంటికి తీసుకురావడంతో సంపద పెరుగుతుందని నమ్మకం. బంగారం మాత్రమే కాదు.. భూమి, ఇల్లు వంటివి.
అక్షయ తృతీయ శుభముహూర్తం హైదరాబాద్‌లో ఉదయం 5.46 గంటల నుంచి మధ్యాహ్నం 12.13 గంటల వరకు ఉంది. ఈ సమయంలో బంగారం కొంటే మంచిదని తెలుస్తోంది.
న్యూ ఢిల్లీలో ఉదయం 5.33 నుంచి మధ్యాహ్నం 12.18 గంటలుగా ఉంది. ముంబైలో ఉదయం 06.06 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గా ఉంది. బెంగళూరులో ఉదయం 5.56 నుంచి మధ్యాహ్నం 12.16 గా ఉంది. చెన్నైలో ఉదయం 5.45 నుంచి మధ్యాహ్నం 12.06 గా ఉంది.