ఆ బ్యాంకులో ఈఎంఐలు ఇక మరింత భారం! లోన్లపై వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలు
HDFC Bank Interest Rate: హెచ్ డీ ఎఫ్ వినియోగదారులకు అలర్ట్.. బ్యాంకులో లోన్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ కొత్త రేట్లను ప్రకటించింది. బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్ల వరకూ ఎంపిక చేసిన టెన్యూర్ లపై పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు ఏడో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చినట్లు హెచ్ డీఎఫ్ బ్యాంక్ వెబ్ సైట్ లో ప్రకటించింది.
చ్ డీ ఎఫ్ వినియోగదారులకు అలర్ట్.. బ్యాంకులో లోన్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ కొత్త రేట్లను ప్రకటించింది. బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్ల వరకూ ఎంపిక చేసిన టెన్యూర్ లపై పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు ఏడో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చినట్లు హెచ్ డీఎఫ్ బ్యాంక్ వెబ్ సైట్ లో ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎంసీఎల్ఆర్ అంటే..
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ద ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసీఎల్ఆర్ అంటే ఒక నిర్దిష్ట రుణం కోసం ఆర్థిక సంస్థ వసూలు చేసే కనీస వడ్డీ రేటు. ఇది రుణం కోసం అతి తక్కువ వడ్డీ రేటును నిర్దేశిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి డైరెక్షన్స్ లేకపోతే ఇదే రుణగ్రహీతలకు కనీస వడ్డీ రేటుగా ఉంటుంది.
హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కొత్త ఎంసీఎల్ఆర్ ఇలా..
బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 10 బీపీఎస్ పెరగడంతో అది 8.25 శాతం నుంచి 8.35 శాతానికి పెరిగింది. బ్యాంక్ ఒక నెల ఎంసీఎల్ఆర్15 పెరిగి పెరిగి 8.30 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ మునుపటి 8.60 శాతం నుంచి 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.70 శాతం వద్ద ఉంది. అయితే ఆరు నెలల ఎంసీఎల్ఆర్, మునుపటి 8.90 శాతం నుంచి 5బీపీఎస్ మాత్రమే పెరిగి 8.95 శాతానికి చేరింది. అయితే, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఉండే ఎంసీఎల్ఆర్ లు మారవు. అనేక వినియోగదారుల రుణాలకు అనుసంధానించబడిన ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 9.05 శాతం నుంచి 9.10 శాతం వద్ద ఉంది. బ్యాంకు రెండేళ్ల నుంచి 9.15 శాతానికి, మూడేళ్ల నుంచి 9.20 శాతానికి పెరిగింది.
ఇతర హెచ్డీఎఫ్సీ ధరలు.. సవరించిన బేస్ రేటు 9.20% జూన్ 16, 2023 నుంచి అమలులోకి వచ్చింది. బెంచ్‌మార్క్ వార్షిక పీఎల్ఆర్ – 17.70%కాగా ఇది కూడా జూన్ 16, 2023 నుండి అమలులోకి వచ్చింది.
ఆర్బీఐ మానిటరీ పాలసీ.. రిజర్వ్ బ్యాంక్ యొక్క మోనిటరీ పాలసీ ప్యానెల్ మూడు రోజుల పాటు (8-10 ఆగస్టు) సమావేశమవుతుంది. పాలసీ రేట్లు, ప్రకటనలకు సంబంధించి ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రకటన చేయనున్నారు.
హెచ్ డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ విలీనం.. విలీనం తర్వాత రుణ ఖాతా హెచ్డీ ఎఫ్సీ బ్యాంక్‌కి బదిలీ చేయబడుతుంది. మీ కస్టమర్ లాగిన్ ఆధారాలు మారవు, మీరు పోర్టల్‌ని యాక్సెస్ చేయడం, బ్యాంక్ సేవలను యథావిధిగ కొనసాగించవచ్చు. ఈ విలీనం మీ ఈఎంపై ఎలాంటి ప్రభావం చూపదు; అది మారదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..