HDFC Bank: హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో కీలక మార్పులు..

దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వినియోగదారులకు కీలకమైన అప్ డేట్ ఇచ్చింది. బ్యాంకులో తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారం సెప్టెంబర్ ఏడో తేదీన అధికారిక బ్యాంకు వెబ్ సైట్లో ప్రకటించింది. వెబ్ సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం..

HDFC Bank: హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో కీలక మార్పులు..
Hdfc
Follow us

|

Updated on: Sep 08, 2024 | 6:15 PM

దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వినియోగదారులకు కీలకమైన అప్ డేట్ ఇచ్చింది. బ్యాంకులో తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారం సెప్టెంబర్ ఏడో తేదీన అధికారిక బ్యాంకు వెబ్ సైట్లో ప్రకటించింది. వెబ్ సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) ఒక పదవీకాలానికి పెంచింది. బ్యాంక్ రుణ వడ్డీ రేట్లను మూడు నెలల కాలానికి 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు పెంచింది. దీని ప్రకారం ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు ఇప్పుడు 9.10% నుంచి 9.45% మధ్య ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హెచ్‌డీ‌ఎఫ్‌సీ తాజా రుణ రేట్లు ఇవి..

హెచ్‌డీ‌ఎఫ్‌సీ 3 నెలల కాలవ్యవధి మినహా ఎలాంటి రుణ రేట్లను బ్యాంక్ సవరించలేదు. ఓవర్ నైట్ కి బ్యాంక్ 9.10% వడ్డీ రేటు కాగా.. ఒక నెలకు 9.15% అందిస్తుంది. మూడు నెలల వ్యవధిలో, బ్యాంక్ 9.25% నుంచి 9.30%కి 5 బీపీఎస్ పెరిగింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.40%. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు వడ్డీ రేటు 9.45% వద్ద ఉంది. ఓవర్ నైట్ కి బ్యాంకులో ఎంసీఎల్ఆర్ 9.10శాతం, ఒక నెల టెన్యూర్ కి 9.15శాతం, మూడు నెలలకు ఎంసీఎల్ఆర్ 9.30శాతం ఉంటుంది. అలాగే ఆరు నెలల వరకూ 9.40శాతం, ఒక ఏడాది టెన్యూర్ కి 9.45శాతం ఎంసీఎల్ఆర్ ఉంటుంది. రెండేళ్లకు, మూడేళ్లకు కూడా 9.45శాతం ఎంసీఎల్ఆర్ ఉంటుంది.

ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?

ఫండ్ ఆధారిత లెండింగ్ రేటు లేదా ఎంసీఎల్ఆర్ మార్జినల్ కాస్ట్ అనేది ఒక నిర్దిష్ట లోన్ కోసం ఒక ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి విధించిన వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్దేశిస్తుంది.

హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లు..

హెచ్డీఎఫ్సీ వెబ్‌సైట్ ప్రకారం బ్యాంకు అడ్జస్ట్ బుల్ రేట్ లోన్ లేదా ఫ్లోటింగ్ రేట్ లోన్ అందిస్తుంది. దీనిలో వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. అలాగే ట్రూఫిక్స్ డ్ లోన్‌ను కూడా అందిస్తుంది. దీనిలో గృహ రుణంపై వడ్డీ రేటు నిర్దిష్టంగా ఉంటుంది. అది లోన్ కాల వ్యవధిలో మొదటి రెండు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత అది అడ్జస్ట్ బుల్-రేటు రుణంగా మారుతుంది. ఈ రేట్లు అన్నీ పాలసీ రెపో రేటుకు బెంచ్‌మార్క్ అవుతాయి. ప్రస్తుత వర్తించే రెపో రేటు 6.50%గా ఉంది. దీని ప్రకారం బ్యాంకులో జీతం, స్వయం ఉపాధి పొందే వారికి ప్రత్యేక గృహ రుణ రేట్లు 8.75% నుంచి 9.65%, ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40% నుంచి 9.95%గా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..