కారు కొనేముందు ఇవి తప్పక తెలుసుకోండి.. లేకపోతే నష్టపోవడం పక్కా..
కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీలలో ఏది ఎంచుకోవాలో తెలియడం లేదా..? మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్, డ్రైవింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులను బట్టి సరైన కారును ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.. సుదీర్ఘ ప్రయాణాలకు, సిటీ డ్రైవింగ్‌కు లేదా కఠినమైన రోడ్లకు ఏ కారు సరిపోతుందంటే..?

దేశంలో ప్రతి సంవత్సరం కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మార్కెట్‌లో SUVల హవా నడుస్తోంది. అయితే, కొత్త కారు కొనడానికి వెళ్ళినప్పుడు చాలా మందికి, హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUVలలో ఏది ఎంచుకోవాలో అర్థం కాదు. మీ అవసరాలకు, మీ బడ్జెట్‌కు ఏ కారు సరిగ్గా సరిపోతుందో తెలుసుకోవడానికి ఈ సులభమైన గైడ్ చూడండి.
కుటుంబంతో దూర ప్రయాణాల కోసం
మీరు మీ కుటుంబంతో తరచుగా ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే సెడాన్ కారు గొప్ప ఎంపిక. సెడాన్‌లలో వెనుక సీటు సౌకర్యంగా ఉంటుంది. ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఐదుగురు వ్యక్తులతో సుదీర్ఘ ప్రయాణాలకు హ్యాచ్‌బ్యాక్‌లు అంత అనుకూలం కావు. మీకు ఎక్కువ మంది కూర్చునే స్థలం, పైకి ఎత్తిన సీటు, పెద్ద బూట్ కావాలంటే SUV ఉత్తమం.
బడ్జెట్, రోడ్లపై ప్రయాణం
మీ బడ్జెట్ రూ. 6 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ఉంటే మీరు హ్యాచ్‌బ్యాక్‌లు లేదా సెడాన్‌లను చూడవచ్చు. మీరు బడ్జెట్‌ను పెంచుకోగలిగితే, కాంపాక్ట్ SUV వైపు వెళ్లడం మంచిది. ఈ SUVలలో క్యాబిన్ పెద్దగా ఉంటుంది. సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో గుంతలు ఉన్న రోడ్లపైనా, కఠినమైన దారులపైనా సులువుగా వెళ్లడానికి SUVల గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఉపయోగపడుతుంది.
సాంకేతికత – సౌకర్యాలు
నేటి కాంపాక్ట్ SUVలు టెక్నాలజీలో ముందున్నాయి. వీటిలో వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్‌లు, పెద్ద టచ్‌స్క్రీన్‌లు, ADAS వంటి ఫీచర్లు ఎక్కువగా లభిస్తాయి. సెడాన్‌లలో కూడా మంచి ఫీచర్లు ఉన్నా, తక్కువ బడ్జెట్‌లో హ్యాచ్‌బ్యాక్‌లలో మాత్రం సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి.
మీ డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి ఎంచుకోండి
చివరిగా మీరు మీ కారును ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారనేది ఎంచుకోవడంలో కీలకం:
సిటీలో : పార్కింగ్ సమస్యలు ఉన్న నగరంలో సులువుగా డ్రైవ్ చేయడానికి, పార్క్ చేయడానికి హ్యాచ్‌బ్యాక్ అత్యంత అనుకూలమైనది.
హైవే : స్థిరంగా, సౌకర్యవంతంగా దూర ప్రయాణాలు చేయాలంటే సెడాన్ అనువైనది.
ఎలాంటి రోడ్లకైనా: గుంతలు పడిన రోడ్లు, కొండ ప్రాంతాలు లేదా అన్ని రకాల కఠినమైన దారులపైనా వెళ్లడానికి SUV ఉత్తమ ఎంపిక.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




