Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harmanpreet Kaur: కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆస్తులు ఎంత..? ఎక్కువ ఆదాయం అక్కడి నుంచే..

భారత్‌కు తొలి ఉమెన్స్ వరల్డ్ కప్ అందించి చరిత్ర సృష్టించింది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. మైదానంలో పరుగుల వర్షం కురిపించే ఆమె.. సంపాదనలోనూ కోట్లు పోగేసింది. ఉమెన్స్ లీగ్, బీసీసీఐ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి ఆమె భారీ ఆదాయం పొందుతుంది. హర్మన్ ఆస్తులు ఎంత ఉన్నాయి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Harmanpreet Kaur: కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆస్తులు ఎంత..? ఎక్కువ ఆదాయం అక్కడి నుంచే..
Harmanpreet Kaur Net Worth
Krishna S
|

Updated on: Nov 03, 2025 | 5:41 PM

Share

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఆమె నాయకత్వంలోనే భారత్ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి టీమిండియాకు టైటిల్‌కు అందించిన 36 ఏళ్ల హర్మన్‌ప్రీత్.. తన ప్రదర్శనతో దేశం మొత్తం గర్వపడేలా చేసింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్, సంపాదనలోనూ కోట్లు పోగేస్తోంది. ఆమె ఆస్తులు ఎంత..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నికర విలువ రూ. 25 కోట్లు

నివేదికల ప్రకారం.. 2024-25లో హర్మన్‌ప్రీత్ కౌర్ నికర విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భారీ ఆదాయం కేవలం క్రికెట్ మ్యాచ్‌ల నుండి మాత్రమే కాకుండా ఎండార్స్‌మెంట్‌లు, బ్రాండ్ ఒప్పందాలు, లీగ్ క్రికెట్ నుండి కూడా వస్తుంది. ప్రపంచ కప్ విజయం ఆమె పేరును క్రికెట్ చరిత్రలో సుస్థిరం చేసింది.

బీసీసీఐ నుండి భారీ జీతం

హర్మన్‌ప్రీత్ బీసీసీఐలో అత్యున్నతమైన గ్రేడ్ A ప్లేయర్‌గా ఉంది. ఈ విభాగంలోని ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.50 లక్షల స్థిర జీతం లభిస్తుంది. అంతేకాకుండా ఆమె ప్రతి మ్యాచ్‌కు అధిక మొత్తాన్ని ఆర్జిస్తుంది:

  • టెస్ట్ మ్యాచ్: రూ.15 లక్షలు
  • వన్డే మ్యాచ్: రూ.6 లక్షలు
  • T20 మ్యాచ్: రూ.3 లక్షలు

లీగ్ నుండి కోట్లు

హర్మన్‌ప్రీత్ కౌర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్ నుండి ఆమె ప్రతి సీజన్‌కు సుమారు రూ.1.80 కోట్లు అందుకుంటుంది. విదేశీ లీగ్‌లు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ఆడటం ద్వారా ఆమె అదనపు ఆదాయాన్ని కూడా పొందుతూ దేశంలో అత్యధిక పారితోషికం పొందే మహిళా క్రికెటర్లలో ఒకరిగా నిలిచింది.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి

హర్మన్‌ప్రీత్ ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ప్యూమా, బూస్ట్, టాటా సఫారీ, CEAT, ఏషియన్ పెయింట్స్ సహా పలు ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఆమె ఒక్కో బ్రాండ్ డీల్‌కు సుమారు రూ.10-12 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆమె మొత్తం వార్షిక ఆదాయం సుమారు రూ.40-50 లక్షల వరకు ఉంటుంది.

లగ్జరీ ఇళ్ళు – కార్లు

హర్మన్‌ప్రీత్‌కు ముంబై, పంజాబ్‌లోని పాటియాలాలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అలాగే ఆమెకు వింటేజ్ జీప్‌లతో పాటు హార్లే-డేవిడ్సన్ బైక్‌లు వంటి ఖరీదైన వాహనాల కలెక్షన్ కూడా ఉంది. పాటియాలాలోని ఆమె బంగ్లాను ‘‘హర్మన్‌ప్రీత్ కౌర్ పాటియాలా హౌస్’’ అని పిలుస్తారు. మైదానంలో ఆటతో దేశం మనసు గెలిచిన హర్మన్‌ప్రీత్, ఆర్థికంగానూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి