Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ELI Scheme: కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి శుభవార్త చెప్పిన కేంద్రం.. రూ. 15 వేలు ఇస్తామని ప్రకటన

భారతదేశంలో తయారీ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడంతో పాటు ఉద్యోగ సృష్టిని పెంచడానికి, ఉపాధిని పెంచడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. ఆయా రంగాల్లో సామాజిక భద్రతను విస్తరించడానికి ఉపాధి ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు.

ELI Scheme: కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి శుభవార్త చెప్పిన కేంద్రం.. రూ. 15 వేలు ఇస్తామని ప్రకటన
Eli
Srinu
|

Updated on: Jul 03, 2025 | 3:17 PM

Share

దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఆర్థిక అవకాశాలను సులభతరం చేయడం లక్ష్యంగా ప్రధానమంత్రి ఐదు-పథకాల ప్యాకేజీలో భాగంగా 2024–25 కేంద్ర బడ్జెట్‌లో ఈఎల్ఐ పథకాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమాలకు కలిపి బడ్జెట్ వ్యయం రూ.2 లక్షల కోట్లుగా ఉంది. ఈ పథకం ఆగస్టు 01, 2025 నుంచి జూలై 31, 2027 వరకు అమలులో ఉంటుంది. ఈ పథకంలో భాగాంగా 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈఎల్ఐ పథకంలో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మొదటిసారి ఉద్యోగం పొంది ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకుంటే మీకు రెండు భాగాలుగా రూ. 15,000 వరకు ప్రోత్సాహకంగా ఇస్తారు. రిజిస్టర్డ్ ఈపీఎఫ్ఓ ​​యజమానితో 6 నెలలు పనిచేసిన తర్వాత మీకు రూ. 7,500, 12 నెలల తర్వాత మిగిలిన మొత్తం రూ. 7,500 లభిస్తుంది. మీరు ఈ మొత్తాన్ని స్వీకరించే ముందు ప్రాథమిక ఆర్థిక కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈఎల్ఐ స్కీమ్ రెండో భాగానికి వచ్చే సరికి కొత్త ఉద్యోగులను నియమించుకుని కనీసం 6 నెలలు వారిని కొనసాగించినందుకు కంపెనీలకు నెలవారీ బహుమతులు లభిస్తాయి. రూ. 10,000 వరకు జీతం → కంపెనీకి నెలకు రూ. 1,000 లభిస్తుంది. జీతం రూ. 10,001–20,000 → కంపెనీకి నెలకు రూ. 2,000 లభిస్తుంది. జీతం రూ. 20,001–1,00,000 → కంపెనీకి నెలకు రూ. 3,000 లభిస్తుంది. తయారీ రంగానికి, ప్రయోజనం 2 సంవత్సరాలు కాకుండా 4 సంవత్సరాలు కొనసాగుతుంది. అయితే మొదటిసారి ఉద్యోగం పొందిన ఈపీఎఫ్ో రిజిస్టర్డ్ సంస్థలో ఉద్యోగం పొందాలి. అలాగే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) కోసం ఆధార్‌తో లింక్ చేసిన యూఏఎన్ నంబర్‌ను యాక్టివేట్ చేయాలి.

దరఖాస్తు ఇలా

  • ఈపీఎఫ్ఓ రికార్డులను సరిగ్గా నిర్వహించాలి. 
  • క్రమం తప్పకుండా కంపెనీలు ఈపీఎఫ్ రిటర్న్‌లను దాఖలు చేస్తున్నాయో? లేదో? తనిఖీ చేయాలి. 
  • మీరు ఉద్యోగం చేరి ఆరు నెలలు పూర్తి అయ్యాక ప్రభుత్వం మీ పాన్-లింక్డ్ వ్యాపార ఖాతాకు ప్రోత్సాహకాన్ని బదిలీ చేస్తుంది.