AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Bookings: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ అవకాశం రెట్టింపు చేసేలా నిర్ణయం

భారతదేశంలో రైలు ప్రయాణం అనేది చౌకైన ప్రయాణ సాధనంగా అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి రైలు ప్రయాణం అనువుగా ఉంటుంది. అయితే రైలు ప్రయాణంలో టిక్కెట్ల బుకింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయాణానికి ముందే టిక్కెట్ కన్‌ఫార్మ్ అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు. అయితే ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ వల్ల ఆన్‌లైన్‌లోనే టిక్కెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ ఐఆర్‌సీటీసీ ఐడీపై ఎన్ని టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చనే విషయంపై ఎవరికీ అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ టిక్కెట్ రూల్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

IRCTC Bookings: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ అవకాశం రెట్టింపు చేసేలా నిర్ణయం
Train Ticket Booking
Nikhil
|

Updated on: Nov 17, 2024 | 3:30 PM

Share

పండుగ సీజన్‌లో ప్రత్యేకించి ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీ వెబ్‌సైట్, యాప్‌లో వారి యూజర్ ఐడిని ఆధార్‌తో లింక్ చేసినట్లయితే,  ఒక నెలలో 24 రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి భారతీయ రైల్వే అనుమతించింది. లేకపోతే కేవలం 12 టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటి వరకు, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఖాతా ఆధార్‌తో అనుసంధానించబడకపోతే నెలకు ఆరు టిక్కెట్లు మరియు లింక్ చేస్తే 12 టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రజలను అనుమతించింది.  ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. తరచూ ప్రయాణించే వారితో పాటు కుటుంబ సభ్యుల కోసం రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఒకే ఖాతాను ఉపయోగించే వారికి ఇది ఉపయోగపడుతుందని భారతీయ రైల్వే తెలిపింది.

అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో ఆరు కంటే ఎక్కువ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఒక ప్రయాణీకుడు ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఒక వ్యక్తి ఒకేసారి 6 కంటే ఎక్కువ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతించబడతారు. అలాగే రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే లేదా అత్యవసర సమయంలో తత్కాల్ టికెట్ బుకింగ్ చేయవచ్చని ప్రయాణికులు గమనించాలి. సాధారణంగా తత్కాల్ టిక్కెట్ ధర సాధారణ టిక్కెట్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు మాత్రమే వాటిని బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ధ్రువీకరించబడిన తత్కాల్ టిక్కెట్ల రద్దు చేస్తే ఎలాంటి వాపసు ఇవ్వరు.

భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాల ప్రకారం తత్కాల్ ఈ-టికెట్‌లో ఒక పీఎన్ఆర్‌కు గరిష్టంగా నలుగురు ప్రయాణికులకు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. తత్కాల్ ఏసీ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్ ఏసీ టికెట్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..