Flipkart Loan: ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు గుడ్ న్యూస్.. కేవలం 30 సెకన్లలో రూ.5 లక్షల పర్సనల్ లోన్.
ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా వ్యక్తిగత రుణాలను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా కస్టమర్లకు వ్యక్తిగత రుణాలను అందించడానికి యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన పర్సనల్ లోన్ సర్వీస్ ద్వారా రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తాలను అందిస్తుంది. అలాగే ఆయా రుణాలపై కస్టమర్లుకు 6 నుంచి 36 నెలల వరకు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల రాకతో భారతదేశంలో గ్రామీణులు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డారు. ఆయా ఈ-కామర్స్ సైట్లు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా వ్యక్తిగత రుణాలను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా కస్టమర్లకు వ్యక్తిగత రుణాలను అందించడానికి యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన పర్సనల్ లోన్ సర్వీస్ ద్వారా రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తాలను అందిస్తుంది. అలాగే ఆయా రుణాలపై కస్టమర్లుకు 6 నుంచి 36 నెలల వరకు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. అయితే ఈ లోన్ ఎలా పొందాలో? మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
లోన్ పొందడం ఇలా
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు తమ లోనల్ల ఆమోద ప్రక్రియ కేవలం 30 సెకన్లలో పూర్తవుతుంది. రుణ దరఖాస్తును ప్రారంభించడానికి కస్టమర్‌లు పాన్ నెంబర్, పుట్టిన తేదీ, వర్క్ వివరాల వంటి ప్రాథమిక వివరాలను అందించాలి. ఈ వివరాలను అందించిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ వారి రుణ పరిమితిని ఆమోదిస్తుంది. కస్టమర్లు వారి సౌకర్యవంతమైన నెలవారీ రీపేమెంట్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారి ఇష్టపడే లోన్ మొత్తాన్ని, రీపేమెంట్ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రుణ దరఖాస్తును ఖరారు చేసే ముందు సమగ్ర లోన్ సారాంశం, రీపేమెంట్ వివరాలు, రివ్యూ కోసం నిబంధనలు, షరత్తులను ఓ సారి తెలుసుకోవడం మంచింది.
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో వ్యూహాత్మక సహకారం ద్వారా కస్టమర్లకు సరసమైన చెల్లింపు ఎంపికల విస్తృత శ్రేణితో విజయవంతంగా సాధికారత కల్పించామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు చెబతుఉన్నారు. బీఎన్‌పీఎల్‌తో పాటు, ఈఎంఐలతో సహా బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో పర్సనల్ లోన్ సర్వీస్‌ను పరిచయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొంటున్నారు. లిక్విడిటీకి ప్రాప్యతను మంజూరు చేయడం ద్వారా క్రెడిట్‌ని ప్రారంభించడం, కొనుగోలు శక్తిని మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు వివరిస్తున్నారు. ముఖ్యంగా కస్టమర్లకు కొనుగోలు విషయంలో ఫ్లిప్‌కార్ట్ చర్యలు ఎక్కువ సౌలభ్యంతో మరింత సౌకర్యాన్ని అందిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..