PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదల.. సింగిల్ క్లిక్‌తో స్టేటస్ తెలుసుకునే అవకాశం
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అంటే వ్యవసాయంపై ఆధారపడే ఎక్కువ మంది ప్రజలు జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగానే వివిధ రంగాలు దేశంలో అభివృద్ధి చెందుతున్నాయి. అయితే అనుకోని విపత్తులు దేశంలోని రైతులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ ద్వారా నేరుగా కొంత సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలకే వేస్తుంది.
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అంటే వ్యవసాయంపై ఆధారపడే ఎక్కువ మంది ప్రజలు జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగానే వివిధ రంగాలు దేశంలో అభివృద్ధి చెందుతున్నాయి. అయితే అనుకోని విపత్తులు దేశంలోని రైతులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ ద్వారా నేరుగా కొంత సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలకే వేస్తుంది. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు దాదాపు రూ.20,000 కోట్లతో పీఎం-కిసాన్ 17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 అందుకుంటారు. మొత్తం సంవత్సరానికి రూ.6,000 అందుకోవచ్చు. . ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు విడతలుగా ప్రతి సంవత్సరం రైతులకు నిధులు అందజేస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
స్టేటస్ చెకింగ్ ఇలా
- ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- పేజీకి కుడి వైపున ఉన్న ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ని పూరించాలి. ‘డేటా పొందండి’ ఎంపికను ఎంచుకుంటే మీ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది
జాబితాలో పేరు తనిఖీ ఇలా
- పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- డ్రాప్-డౌన్ నుంచిరాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంచుకోవాలి.
- అనంతరం ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే లబ్ధిదారుల జాబితా వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
ఈ-కేవైసీ
పీఎం-కిసాన్ వాయిదాలను స్వీకరించడానికి రైతులు తప్పనిసరిగా వారి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పీఎం-కిసాన్ నమోదిత రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీప సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..