AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIC Cautions: భారత్‌లో పెరుగుతున్న కస్టమ్స్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రజలను మోసగించేందుకు మోసగాళ్లు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఏదైనా అవసరంతో ఇతరులకు పార్శిల్స్ చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాలంలో కస్టమ్స్ పేరుతో ఫోన్ చేసే మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కస్టమ్స్ పేరుతో మోసం చేసే మోసగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) కోరింది. ఈ మేరకు ఇటీవల సీబీఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

CBIC Cautions: భారత్‌లో పెరుగుతున్న కస్టమ్స్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
Cyber Frauds
Nikhil
|

Updated on: Jun 18, 2024 | 4:15 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రజలను మోసగించేందుకు మోసగాళ్లు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఏదైనా అవసరంతో ఇతరులకు పార్శిల్స్ చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాలంలో కస్టమ్స్ పేరుతో ఫోన్ చేసే మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కస్టమ్స్ పేరుతో మోసం చేసే మోసగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) కోరింది. ఈ మేరకు ఇటీవల సీబీఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది. భారతీయ కస్టమ్స్ అధికారులుగా నటిస్తూ ప్రజల డబ్బును కొట్టేస్తున్నారని ఇటీవల న్యూస్ పోర్టల్స్/సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వివిధ సంఘటనలు వెలుగులోకి వచ్చాయని సీబీఐసీ పేర్కొంది. కాబట్టి ఈ మోసాలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని వివరించింది. ఈ నేపథ్యంలో కస్టమ్స్ పేరుతో చేసే మోసాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కస్టమ్స్ పేరుతో జరిగే మోసాలు ప్రధానంగా ఫోన్ కాల్‌లు లేదా ఎస్ఎంఎస్ వంటి డిజిటల్ మార్గాలను ఉపయోగించి జరుగుతాయి. ముఖ్యంగా మోసగాళ్లు కాల్ చేసి మీ పార్శిల్‌లో నిషేధిత వస్తువులు గుర్తించామని, ఈ తప్పుకు చట్టప్రకారం పడే శిక్షలను వివరిస్తూ భయపెడతారు. వీటి నుంచి తప్పించుకునేందుకు డబ్బు డిపాజిట్ చేయాలని మన ఖాతా నుంచి సొమ్ము తస్కరిస్తూ ఉంటారు. ఈ మోసాలను అరికట్టేందుకు ప్రజల అవగాహన చాలా ముఖ్యమని సీబీఐసీ ఒక మల్టీ మోడల్ అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో వార్తాపత్రిక ప్రకటనలు, సాధారణ ప్రజలకు ఎస్ఎంఎస్/ఈ-మెయిల్‌లు, సోషల్ మీడియా ప్రచారం, సీబీఐసీ ఫీల్డ్ ఫార్మేషన్‌ల ద్వారా అవగాహన ప్రచారాలు ఉంటాయి. మోసగాళ్లను గుర్తించడంతో పాటు మోసానికి గురికాకుండా వినియోగదారులు కాలర్ పూర్వాపరాలను ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మీ పేరుతో పార్శిల్ వచ్చింది దానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించి పార్మిల్ పట్టుకెళ్లాలని సూచిస్తూ మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని సీబీఐసీ పేర్కొంది. 

మోసగాళ్లు ముఖ్యంగా కొరియర్ అధికారులు/సిబ్బందిగా నటిస్తూ మోసగాళ్లు కాల్‌లు, టెక్ట్స్ మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్‌ల ద్వారా మోసానికి తెరలేపుతారు. ఆ తర్వాత ఈ మోసగాళ్లు కస్టమ్స్/పోలీస్/ సీబీఐ అధికారులుగా నటించి విదేశాల నుంచి వచ్చిన ప్యాకేజీలు/బహుమతుల కోసం కస్టమ్స్ డ్యూటీ/క్లియరెన్స్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా చెల్లింపులు చేయకపోతే కొరియర్ రిటర్న్ వెళ్లిపోతుందని, ఒక్కోసారి ఫైన్స్ కూడా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటారు. చట్టవిరుద్ధమైన కంటెంట్‌లు (డ్రగ్స్/విదేశీ కరెన్సీ/నకిలీ పాస్‌పోర్ట్/నిషేధ వస్తువులు వంటివి) లేదా కస్టమ్స్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా తమ ప్యాకేజీని కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నట్లు బాధితులు నమ్మి చెల్లింపులు చేస్తారు. మన భయమే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతారు. ముఖ్యంగా చెల్లింపులు సీబీఐసీ నేరుగా అడగదనే విషయంలో గమనించాలని అధికారులు కోరుతున్నారు. ప్రజల అవగాహన కల్పించుకుంటే మోసగాళ్లకు చెక్ పెట్టవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..