Yamaha EV Scooter: స్టైలిష్ లుక్‌తో నయా ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసిన యమహా.. త్వరలోనే భారత్‌లోకి ఎంట్రీ..!
తాజాగా ప్రముఖ కంపెనీ యమహా కూడా త్వరలోనే భారతదేశంలో తన స్టైలిష్ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేయనుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజా మీడియా నివేదికల ప్రకారం యమహా జపాన్, భారతీయ అనుబంధ సంస్థలు గత సంవత్సరంగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్కూటర్ల కంటే విభిన్నంగా స్టైలిష్ లుక్ ఈ స్కూటర్‌ను లాంచ్ చేయనున్నారు.
భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. అమెరికా, చైనా తర్వాతే భారత్‌లోనే అధికంగా ఈవీ వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో తమ ఉత్పత్తుల విక్రయాన్ని పెంచుకునేందుకు స్టార్టప్ ఈవీ కంపెనీల నుంచి టాప్ కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. తాజాగా ప్రముఖ కంపెనీ యమహా కూడా త్వరలోనే భారతదేశంలో తన స్టైలిష్ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేయనుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజా మీడియా నివేదికల ప్రకారం యమహా జపాన్, భారతీయ అనుబంధ సంస్థలు గత సంవత్సరంగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్కూటర్ల కంటే విభిన్నంగా స్టైలిష్ లుక్ ఈ స్కూటర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో యమహా తాజా ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. గత సంవత్సరం యమహా మోటార్ కంపెనీ ఈవీ స్టార్టప్, రివర్ మొబిలిటీలో 332 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. కాబట్టి త్వరలోనే సరికొత్త ఈవీలతో యమహా హల్‌చల్ చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. యమహా ఈవీ స్కూటర్ జెన్ జెడ్ పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర కంపెనీలకు పోటినిచ్చేలా ఫీచర్లతో డిజైన్ విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు యమహా ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం, భారతదేశంలోని చాలా మంది ఈ-స్కూటర్ కొనుగోలుదారులు తమ పర్యావరణ అనుకూలత కంటే ఈవీ వాహనాల ద్వారా వాహన నిర్వహణ చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేలా యమహా మోటార్ కంపెనీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఫీచర్‌తో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
సాధారణంగా ఈవీ మార్కెట్‌లో ఐసీఈ మోటర్ వాహనాలు 70 నుండి 80 శాతం అమ్మకాలను కలిగి ఉన్నాయి. 2030 నాటికి యమహా ఒకటి లేదా రెండు ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. అదనంగా వాహన ఉద్గారాలను తగ్గించడానికి ఇథనాల్, బయో ఫ్యూయల్ ద్వారా నడిచే స్కూటర్లను లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. యమహా బ్రాండ్ ఇప్పుడు 2025-27 కోసం కొత్త మిడ్‌టర్మ్ ప్లాన్‌ను రూపొందిస్తుంది. ఇందులో భాగంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ మోడళ్లను రిలీజ్ చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. యమహా ప్రస్తుత ప్రణాళిక, డిసెంబర్‌లో ముగుస్తుంది. అనంతరం భారతదేశం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో ప్రీమియం మోటార్‌సైకిళ్ల విక్రయాలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా యమహా కంపెనీ భారతదేశంలో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..