5 Day Work In A Week: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే వారానికి ఐదు రోజుల పని దినాలు షురూ..!

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్‌ల మధ్య ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరినందున బ్యాంకు ఉద్యోగుల వారానికి 5 రోజుల పని చేయాలనే డిమాండ్ త్వరలో నెరవేరే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఆమోదం పెండింగ్‌లో ఉంది, 2024 తర్వాత బ్యాంకు ఉద్యోగులు దీనిని పొందాలని భావిస్తున్నారు.  యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వంటి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, కొంతకాలంగా శనివారాలు సెలవుతో 5 రోజుల పనివారానికి ఒత్తిడి తెస్తున్నాయి.

5 Day Work In A Week: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే వారానికి ఐదు రోజుల పని దినాలు షురూ..!
Bank Employees
Follow us

|

Updated on: May 05, 2024 | 4:15 PM

భారతదేశంలోని బ్యాంకు ఉద్యోగులు ఎప్పటినుంచో వారానికి ఐదు రోజుల పని దినాలను కల్పించాలని కోరుతున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్‌ల మధ్య ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరినందున బ్యాంకు ఉద్యోగుల వారానికి 5 రోజుల పని చేయాలనే డిమాండ్ త్వరలో నెరవేరే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఆమోదం పెండింగ్‌లో ఉంది, 2024 తర్వాత బ్యాంకు ఉద్యోగులు దీనిని పొందాలని భావిస్తున్నారు.  యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వంటి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, కొంతకాలంగా శనివారాలు సెలవుతో 5 రోజుల పనివారానికి ఒత్తిడి తెస్తున్నాయి. దీని వల్ల కస్టమర్ సర్వీస్ వేళల్లో ఎలాంటి తగ్గింపు ఉండదని వారు హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వారంలో ఐదు రోజుల పని దినాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

డిసెంబర్ 2023లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని, ప్రైవేట్ రుణదాతలు, బ్యాంక్ యూనియన్‌లను కలిగి ఉన్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో ప్రభుత్వ ఆమోదానికి లోబడి 5 రోజుల పనివారానికి సంబంధించిన ప్రతిపాదన ఉంది. తదనంతరం మార్చి 8, 2024న, 9వ జాయింట్ నోట్‌పై ఐబీఏ, బ్యాంక్ యూనియన్‌లు సంతకం చేశాయి. ఐబీఏ, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సంతకం చేసిన జాయింట్ నోట్, శని, ఆదివారాలు సెలవుతో 5 రోజుల వారానికి మార్పును వివరించింది. అయితే ఐబీఏ, బ్యాంక్ యూనియన్లు అంగీకరించినప్పటికీ తుది నిర్ణయం ప్రభుత్వానిదే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకింగ్ గంటలు, ఇంటర్‌బ్యాంక్ కార్యకలాపాలను నియంత్రిస్తుంది కాబట్టి ఈ ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి గడువును ప్రకటించలేదు.

అయితే కొంతమంది నిపుణులు మాత్రం ఈ నిర్ణయం ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో ప్రభుత్వం నోటిఫికేషన్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆమోదించిన తర్వాత నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం శనివారాలు అధికారికంగా సెలవులుగా గుర్తిస్తారు. నివేదికల ప్రకారం వారానికి 5 రోజుల పనిని ప్రభుత్వం ఆమోదిస్తే సవరించిన పని గంటలు కూడా పనిదినాన్ని 40 నిమిషాలు, ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాంకు శాఖలు రెండు, నాలుగో శనివారాలు మూసివేస్తున్నారు. 2015 నుంచి అన్ని శని, ఆదివారాల్లో ఆఫ్‌లు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్‌మెంట్ ప్రకారం ఆర్‌బీఐ, ప్రభుత్వం ఐబీఏతో ఏకీభవించి, రెండు, నాలుగో శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..