Car Loan: కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ వసూలు చేస్తుందో తెలుసా?

ఇక కారు లోన్‌ పొందాలంటే ప్రధానంగా సిబిల్‌ స్కోర్‌ బాగుండాలని తెలిసిందే. క్రెడిట్‌ స్కోర్‌ కనీసం 750గా ఉండాలని బ్యాంకులు చెబుతుంటాయి. కారు ఆన్‌ రోడ్ ధరలో ఏకంగా 80 నుంచి 90 శాతం రుణంగా అందిస్తున్నాయి బ్యాంకులు. అయితే దీనికి మంచి సిబిల్‌ స్కోర్‌ ఉండాలి. ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ లోన్‌ ఏ బ్యాంకులో తీసుకోవాలనేకదా మీ డౌట్‌. మరి ప్రస్తుతం కార్‌ లోన్స్‌పై ఏయే బ్యాంకు...

Car Loan: కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ వసూలు చేస్తుందో తెలుసా?
Car Loan
Follow us

|

Updated on: May 05, 2024 | 2:35 PM

ఇటీవల కారు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం కొందరు మాత్రమే కారు వైపు మొగ్గు చూపే వారు కానీ ప్రస్తుతం బ్యాంకులు లోన్‌లు అందిస్తుండతో చాలా మంది వేతన జీవులు కొత్త కారు కొనుగోలు చేస్తున్నారు. ఇక కొత్త కార్లకు బ్యాంకులు ఏకంగా 90 శాతం వరకు లోన్‌లు ఇస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అసలు జీరో డౌన్‌ పేమెంట్‌తో కూడా కొరు సొంతం చేసుకునే అవకాశాలు కలిపిస్తున్నారు.

ఇక కారు లోన్‌ పొందాలంటే ప్రధానంగా సిబిల్‌ స్కోర్‌ బాగుండాలని తెలిసిందే. క్రెడిట్‌ స్కోర్‌ కనీసం 750గా ఉండాలని బ్యాంకులు చెబుతుంటాయి. కారు ఆన్‌ రోడ్ ధరలో ఏకంగా 80 నుంచి 90 శాతం రుణంగా అందిస్తున్నాయి బ్యాంకులు. అయితే దీనికి మంచి సిబిల్‌ స్కోర్‌ ఉండాలి. ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ లోన్‌ ఏ బ్యాంకులో తీసుకోవాలనేకదా మీ డౌట్‌. మరి ప్రస్తుతం కార్‌ లోన్స్‌పై ఏయే బ్యాంకు ఎంత వడ్డీ వసూలు చేస్తుందో తెలుసుకొని. వాటికి అనుగుణంగా మీ లోన్‌ను ప్లాన్‌ చేసుకోండి..

* ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ కారు రుణాలపై 9.10 శాతం ఇంట్రెస్ట్‌ రేట్‌ను వసూలు చేస్తోంది.

* ఇక మరో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌ యాక్సిస్‌ కారులోన్‌పై 8.20 శాతం వడ్డీ రేటుగా ఉంది. ఇది చాలా తక్కువేనని చెప్పాలి.

* ఇక కెనరా బ్యాంకులో కారు లోన్లపై వార్షిక వడ్డీ రేటు 8.70 శాతంగా అందుబాటులో ఉంది.

* యూనియన్‌ బ్యాంకు విషయానికొస్తే ఇందులో కారు లోన్‌పై వడ్డీ రేటు 8.70 శాతం నుంచి ప్రారంభమవుతుంది.

* ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ కారు లోన్లపై వార్షిక వడ్డీ 8.75 శాతం నుంచి అందిస్తోంది.

* ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కారు రుణాలపై వడ్డీ రేట్లు 8.85 శాతం నుంచి అందిస్తున్నాయి.

* దేశంలో మరో దిగ్గజ ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీలో వడ్డీ రేటు 8.95 నుంచి మొదలవుతున్నాయి.

* కరూర్ వైశ్యా బ్యాంకు విషయానికొస్తే ఇందులో కారు రుణాలపై వడ్డీ రేట్లు 9.55 శాతం నుంచి అందిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..