Saving Scheme: రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్నో రకాల సేవింగ్‌ స్కీమ్స్‌ను తీసుకొచ్చింది. ఇలాంటి వాటిలో ఒకటి గ్రామ్‌ సురక్ష పథకం. ఇది కేవలం సేవింగ్స్‌ మాత్రమే కాకుండా హెల్త్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ పాలసీ కావడం విశేషం. 1955లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో చేరిన వ్యక్తి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత బోనస్‌తో పాటు డబ్బు అందిస్తారు. ఒకవేళ పాలసీ సమయంలో బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే...

Saving Scheme: రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
Post Office
Follow us

|

Updated on: May 05, 2024 | 3:54 PM

మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేస్తుంటాం. వారి వారి ఆదాయాలకు అనుగుణంగా పొదుపు చేసుకుంటుంటాం. ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మనలో చాలా మంది రిస్క్‌ తక్కువగా ఉండి ఎక్కువ రిటర్న్స్‌ వచ్చే పథకాలవైపు మొగ్గు చూపుతుంటారు. ఇలాంటి వాటిలో మొదటి స్థానంలో ఉంటుంది ఇండియన్‌ పోస్టాఫీస్‌.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్నో రకాల సేవింగ్‌ స్కీమ్స్‌ను తీసుకొచ్చింది. ఇలాంటి వాటిలో ఒకటి గ్రామ్‌ సురక్ష పథకం. ఇది కేవలం సేవింగ్స్‌ మాత్రమే కాకుండా హెల్త్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ పాలసీ కావడం విశేషం. 1955లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో చేరిన వ్యక్తి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత బోనస్‌తో పాటు డబ్బు అందిస్తారు. ఒకవేళ పాలసీ సమయంలో బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందిస్తారు.

19 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. ప్రీమియంను 3 నెలలు, 6 నెలలు, ఏడాదికి ఒకసారి పెట్టొచ్చు. ఇక 55 ఏళ్లు, 58 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే రుణాన్ని కూడా పొందే అవకాశం ఉంది. పాలసీ తీసుకున్న 4 సంవత్సరాల తరువాత రుణ సదుపాయం పొందొచ్చు. ఇందుకోసం రుణంపై 10 శాతం వడ్డీ ఉంటుంది.

ఒకవేళ మీకు రూ. 30 లక్షలు రిటర్న్‌ రావాలంటే ఎంత చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే.. 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.31.6 లక్షలు పొందుతారు. అదే విధంగా 58 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.33.4 లక్షలు, 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.34.6 లక్షల మెచ్యూరిటీ పొందొచ్చు. 55 ఏళ్ల మెచ్యూరిటీ కోసం నెలకు రూ. 1515 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు సుమారు రూ. 50 మాత్రమే. ఒకవేళ 58 ఏళ్లకు అయితే రూ.1463, 60 ఏళ్లకు అయితే రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..