Multi Bagger Stock: ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది..

అనుబంధ కంపెనీల్లో ఒకటి ట్రెంట్‌ లిమిటెడ్‌. ఇది టాటా గ్రూప్‌లో భాగమైన భారతీయ రిటైల్ కంపెనీ. ఇది వెస్ట్‌సైడ్, జూడియో, ఉట్సా వంటి ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌ రిటైల్ స్టోర్లను కలిగి ఉన్న కంపెనీ. ఇది జాయింట్ వెంచర్ల ద్వారా స్టార్ బజార్, జారా వంటి రిటైల్ చైన్‌లను కూడా నడుపుతుంది. ఈ ట్రెంట్‌ లిమిటెడ్‌కు సంబంధించిన స్టాక్స్‌ భారీ లాభాలను అందించాయి. గత ఒక సంవత్సరంలో తన పెట్టుబడిదారులకు 200 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయి.

Multi Bagger Stock: ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది..
Multibagger Stocks
Follow us

|

Updated on: May 05, 2024 | 4:17 PM

మదుపరులకు టాటా కంపెనీ ఎప్పుడూ మంచి ఆప్షన్‌. అధిక లాభాలను అందిస్తూ ఉంటుంది. అందుకే పెట్టుబడిదారులకు మల్టీ బ్యాగర్‌ గా మంచి రాబడిని అందించే విశ్వసనీయ స్టాక్‌లలో ఒకటిగా టాటా నిలిచింది. టాటా గ్రూప్‌లో కేవలం మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలే కాకుండా దాని అనుబంధ కంపెనీలు కూడా మంచి లాభాలను అందిస్తున్నాయి. అలాంటి అనుబంధ కంపెనీల్లో ఒకటి ట్రెంట్‌ లిమిటెడ్‌. ఇది టాటా గ్రూప్‌లో భాగమైన భారతీయ రిటైల్ కంపెనీ. ఇది వెస్ట్‌సైడ్, జూడియో, ఉట్సా వంటి ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌ రిటైల్ స్టోర్లను కలిగి ఉన్న కంపెనీ. ఇది జాయింట్ వెంచర్ల ద్వారా స్టార్ బజార్, జారా వంటి రిటైల్ చైన్‌లను కూడా నడుపుతుంది. ఈ ట్రెంట్‌ లిమిటెడ్‌కు సంబంధించిన స్టాక్స్‌ భారీ లాభాలను అందించాయి. గత ఒక సంవత్సరంలో తన పెట్టుబడిదారులకు 200 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయి. మూడేళ్లలో పెట్టుబడిదారులకు 400 శాతానికి పైగా లాభాలను అందించాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రూ.4,496 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ షేర్లు ఇటీవల 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుని రూ.4,680 వద్ద ట్రేడయ్యాయి.

అందరి చూపు ట్రెంట్‌ వైపు..

ట్రెంట్ కంపెనీ 2024 ఆర్థిక సంవత్సంరం నాల్గో త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో బహుళ రెట్లు పెరిగి రూ.712 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.45 కోట్లుగా ఉంది. మల్టీబ్యాగర్ టాటా స్టాక్ రిటర్న్‌లను చూసిన తర్వాత బ్రోకరేజ్ సంస్థలు ఇప్పుడు దీనిపై బుల్లిష్‌గా మారుతున్నాయి. ఒక సంవత్సరం క్రితం, ట్రెంట్ లిమిటెడ్ షేర్ల ధర సుమారు రూ. 1406. ఆ సమయంలో ఎవరైనా ఈ షేర్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి, ఈరోజు విత్‌డ్రా చేస్తే, ఇన్వెస్టర్ల ఖాతాలో రూ. 3 లక్షలకు పైగా ఉంటుంది. మూడు నెలల్లో 43 శాతం లాభాన్ని ఇచ్చింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,59,440 కోట్లు. కంపెనీ మార్చి త్రైమాసిక ఫలితాలు ఇప్పుడు బ్రోకరేజ్ సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్రెంట్ దేశవ్యాప్తంగా 232 వెస్ట్‌సైడ్, 545 జూడియో స్టోర్‌లను కలిగి ఉంది.

భవిష్యత్తుపైనా భారీ అంచనాలు..

ఇది ఆదాయ కార్యకలాపాలలో సంవత్సరానికి 51 శాతం జంప్ చేసి రూ. 3,297.70 కోట్లకు చేరుకుంది. భవిష్యత్తులో ఈ స్టాక్‌లో బలమైన వృద్ధిని చూడవచ్చని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. స్టాక్‌కు కొనుగోలు రేటింగ్ ఇవ్వడంతో, బ్రోకరేజ్ దాని టార్గెట్ ధరను రూ. 4,870గా నిర్ణయించింది. జూడియోలో హెల్తీ స్కేల్-అప్, ఇతర అంశాల కారణంగా, ట్రెంట్ లిమిటెడ్ రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో వృద్ధికి భారీ రన్‌వేని కలిగి ఉందని బ్రోకరేజ్‌ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..