బంగారం కొంటారా..? ఆకాశం చూడాల్సిందే.. పసిడి ధర పైపైకి..
బంగారం అంటే ఇష్టపడని మహిళలు అంటూ ఎవరూ వుండరు. కాని రోజు రోజుకి బంగారం ధరలు అందనంత స్థాయికి చేరుతున్నాయి. అంతర్జాయ మార్కెట్లలో బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధర 15 వందల డాలర్లకు చేరుకుంది. ఇండియాలో 10 గ్రాముల బంగారం 38 వేల 500 రూపాయలకు చేరుకుంది. రెండ్రోజుల్లోనే బంగారం ధర 663 రూపాయలకు పెరిగింది. గతేడాది ఇదే నెలలో 10 గ్రాముల బంగారం 30 వేలు ఉండగా ఇప్పుడు […]
బంగారం అంటే ఇష్టపడని మహిళలు అంటూ ఎవరూ వుండరు. కాని రోజు రోజుకి బంగారం ధరలు అందనంత స్థాయికి చేరుతున్నాయి. అంతర్జాయ మార్కెట్లలో బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధర 15 వందల డాలర్లకు చేరుకుంది. ఇండియాలో 10 గ్రాముల బంగారం 38 వేల 500 రూపాయలకు చేరుకుంది. రెండ్రోజుల్లోనే బంగారం ధర 663 రూపాయలకు పెరిగింది. గతేడాది ఇదే నెలలో 10 గ్రాముల బంగారం 30 వేలు ఉండగా ఇప్పుడు ఏకంగా 8వేల రూపాయలు పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మరో 15 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ధర పెరిగినా శ్రావణ మాసం కావడంతో బంగారం కొనుగోలు చేయక తప్పడం లేదని కొనుగోలు దారులు చెబుతున్నారు. కాగా, పసిడి ధర బాగా పెరగడంతో మధ్యతరగతి వారు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది.