Gold Price Today: రూ.75 వేలకు చేరువలో బంగారం ధరలు..దిగి రాని వెండి

దేశంలోని బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండింతలుగా పెరుగుతున్నాయి. అయితే రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు ఈ రోజు ఏప్రిల్ 28, 2024 ఉదయం 6 గంటల సమయానికి ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.72 వేలు దాటగా, వెండి కిలో ధర రూ.84 వేలు ఉంది. జాతీయ స్థాయిలో 999 స్వచ్ఛత..

Gold Price Today: రూ.75 వేలకు చేరువలో బంగారం ధరలు..దిగి రాని వెండి
Gold Price
Follow us

|

Updated on: Apr 28, 2024 | 6:04 AM

దేశంలోని బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండింతలుగా పెరుగుతున్నాయి. అయితే రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు ఈ రోజు ఏప్రిల్ 28, 2024 ఉదయం 6 గంటల సమయానికి ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.72 వేలు దాటగా, వెండి కిలో ధర రూ.84 వేలు ఉంది. జాతీయ స్థాయిలో 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,930 ఉంది. అలాగే వెండి ధర రూ.84,000 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,850 ఉండగా, 24 క్యారెట్ల 72,930 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,000 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,080, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,930 ఉంది. హైదరాబాద్‌ 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ.66,850 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.72,930 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,930 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,930 ఉంది.

మీరు మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలను కూడా తనిఖీ చేయవచ్చు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. కొంత సమయం లోపు మీరు SMS ద్వారా రేటు సమాచారాన్ని పొందుతారు. అదే సమయంలో మీరు అధికారిక వెబ్‌సైట్ ibjarates.comని సందర్శించడం ద్వారా ఉదయం, సాయంత్రం గోల్డ్ రేట్ అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు.

మేకింగ్ ఛార్జీలు మరియు పన్నులు విడివిడిగా..

ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ధరలు వివిధ స్వచ్ఛతలతో కూడిన బంగారం ప్రామాణిక ధర గురించి సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ధరలన్నీ పన్ను, మేకింగ్ ఛార్జీలకు ముందు ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, బంగారం లేదా వెండి ధరలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాటిలో పన్నులు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి