Gold Price Today: కొన్ని గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా..?
Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు..

ఇటీవల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. గత రెండు, మూడు రోజుల నుంచి పరుగులు పెడుతోంది. ఉదయం పెరిగిన బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే భారీగా పతనమైపోయింది. దేశంలో సామాన్యులు కొనలేని పరిస్థితుల్లో బంగారం ధరలు ఉంటున్నాయి. మళ్లీ లక్ష రూపాయలకు చేరువలో ఉన్న పసిడి.. శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి తగ్గుముఖం పట్టింది. జూలై 3న బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అయితే, ఈరోజు బంగారం ధర మునుపటి రోజుతో పోలిస్తే భారీగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ ప్రకారం.. ఈరోజు ఉదయం వరకు బంగారం ధర రూ.600 తగ్గింది. దీనితో, ఈరోజు దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.98,730 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.90,500 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Minimum Balance Rules: ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల ఎత్తివేత
ఏ నగరంలో ధర ఎంత?
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.98,880కి కొనుగోలు చేయవచ్చు. ఇది రూ.600 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,650కి చేరుకోగా, 18 క్యారెట్ల బంగారం 74,170కి చేరుకుంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములకు) ధర రూ.98,730. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,500, 18 క్యారెట్ల బంగారం రూ.74,050కి కొనుగోలు చేయవచ్చు.
ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములకు) ధర రూ.98,730 ఉండగా. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,500, 18 క్యారెట్ల బంగారం రూ.74,050కి కొనుగోలు చేయవచ్చు. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై వెయ్యి రూపాయల వరకు తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో వెండి ధర 1 లక్షా 10 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో కిలో వెండి ధర ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం 1 లక్షా 20 వేల వరకు ఉంది.
ఇది కూడా చదవండి: Viral Video: వామ్మో..! ఏం మింగిందో ఏందో.. భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి