Gold Price: మళ్లీ బంగారం ధరలకు రెక్కలు.. తులం ధర ఎంతో పెరిగిందో తెలుసా..?
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంది. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం.. తాజాగా పరుగులు పెట్టింది..

మళ్లీ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. గురువారం దేశీయంగా బంగారం ధర రూ.450 పెరిగి రూ.99,620కి చేరుకుంది. అంటే మళ్లీ లక్ష రూపాయల చేరువలో ఉంది. ఇక బుధవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.99,170 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.400 పెరిగి రూ.99,000కి చేరుకుంది. మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో ఇది 10 గ్రాములకు రూ.98,600 వద్ద ముగిసింది. గురువారం వెండి ధర కూడా రూ.1,000 పెరిగి కిలోకు రూ. లక్షా 11 వేలకు చేరింది.
ఇది కూడా చదవండి: Viral Video: వామ్మో..! ఏం మింగిందో ఏందో.. భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది..
అందుకే బంగారం ధర పెరిగింది:
డాలర్ ఇండెక్స్ కొత్త 3.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడం, US బాండ్ దిగుబడి రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో బంగారం, వెండి పెరుగుతూనే ఉన్నాయని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి అన్నారు. అదనంగా జూలై 9న US వాణిజ్య సుంకాల గడువు గురించి ఆందోళనలు కూడా దీనికి మరింత మద్దతు ఇచ్చాయి. వాణిజ్య ఒప్పందాన్ని సకాలంలో ఖరారు చేయకపోతే అధిక సుంకాలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరతకు దారితీయవచ్చు. ఇది బులియన్ ధరలకు సహాయపడుతుందని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే..!
ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి