AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బులియన్‌ మార్కెట్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌!

Gold Rate: ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశంలో సుమారు 50 శాతం పాత బంగారం అమ్ముడైంది. ప్రస్తుతం లాభం పొందే అవకాశం, భవిష్యత్తులో బంగారం ధర తగ్గే అవకాశం ఉన్నందున ఈ బంగారాన్ని అమ్ముతున్నారని అంటున్నారు. భవిష్యత్తులో బంగారం ధర గణనీయంగా తగ్గబోతోందని..

Gold Rate: తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బులియన్‌ మార్కెట్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌!
Gold Big Updates
Subhash Goud
|

Updated on: Jun 30, 2026 | 8:35 AM

Share

Gold Rate: రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే అంశంపై రకరకాల వాదనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొందరేమో భవిష్యత్తులో బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతుంటే మరి కొందరేమో తులం బంగారం ధర భారీ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నివేదికల ప్రకారం గత మూడు నెలల్లోనే భారతీయులు సుమారు 50 టన్నుల బంగారాన్ని అమ్మేసినట్లు వెలువడ్డాయి. ఇప్పుడు మరో అప్‌డేట్‌ ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..

ఈ రోజుల్లో బంగారం ధర కొన్నిసార్లు పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం బంగారం ధర సర్వకాలిక గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కానీ ఇప్పుడు బంగారం ధర తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ సమీపంలోని బంగారం, బంగారు ఆభరణాలను అమ్మి లాభం పొందుతున్నారు. చాలా మంది పాత ఆభరణాలను అమ్మి లాభం పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బంగారం అమ్మి లాభం పొందాలా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది.

భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.2 లక్షలకు పడిపోవచ్చు:

అందిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశంలో సుమారు 50 శాతం పాత బంగారం అమ్ముడైంది. ప్రస్తుతం లాభం పొందే అవకాశం, భవిష్యత్తులో బంగారం ధర తగ్గే అవకాశం ఉన్నందున ఈ బంగారాన్ని అమ్ముతున్నారని అంటున్నారు. భవిష్యత్తులో బంగారం ధర గణనీయంగా తగ్గబోతోందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర 1.2 లక్షలకు పడిపోవచ్చని అంటున్నారు. అందుకే ప్రజలు ప్రస్తుతం తమ పాత ఆభరణాలను అమ్మి లాభం పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మీరు బంగారం అమ్మాలా?

మీరు ఆ విధంగా చూస్తే, బంగారం అమ్మాలా వద్దా అని నిర్ణయించుకునేటప్పుడు దీని గురించి ఆలోచించాలి. మీకు నిజంగా ఇప్పుడే డబ్బు అవసరమా? బంగారం అమ్మేటప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. బంగారం ఒక మంచి పెట్టుబడి ఎంపిక. అందువల్ల మీరు బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా కొనుగోలు చేసి ఉంటే దానిని అమ్మకూడదు. కానీ మీకు లాభం కావాలంటే బంగారం అమ్మడానికి ఇదే సరైన సమయం కావచ్చని అంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి: SIP: కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?

ఇది కూడా చదవండి: Saving Account: బ్యాంకు ఖాతాను మరో నగరానికి మారుస్తున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు