Gold Price Today: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
బంగారం కొనేవారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయికి చేరిన బంగారం ధరలు.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 6 గంటల మధ్యలో తులం బంగారంపై స్వల్ప తగ్గుదల కనిపించింది. కాబట్టి ప్రస్తుతం తెలుగురాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం, వెండి కొనాలని చూసే వారికి ఇదోక గుడ్‌న్యూస్ చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా రికార్డ్ స్థాయిలో దూసుకుపోయిన ఈ ఆభరణాల ధరలు రెండు మూడు రోజులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మారకం కారణంగా బంగారం, వెండి ధరల్లో ఈ మార్పులు సంభవిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు పెరుగుదల బంగారం ధరలను చాలా ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఈ కారణంగా అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్టు తెలిపారు. కాబట్టి ప్రస్తుతం తెలుగురాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో చూద్దాం.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
- దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,54,140 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,290గా కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉన్నాయి.
- విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉన్నాయి.
- ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉన్నాయి.
- బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290 వద్ద ట్రేడవుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉన్నాయి.
- దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,290గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,440 వద్ద కొనసాగుతోంది
వెండి ధరలు ఇలా..
ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. ప్రతస్తుం దేశీయ మార్కెట్‌లో కేజీ బంగారం ధర రూ. 2,49,900 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.2,50,000గా ఉంది, ఇక హైదరాబాద్, కేరళలో కేజీ బంగారం ధర రూ.2,54,900గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, పూణె, బెంగళూరు నగరాల్లో మాత్రం ఈ ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
