AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: ఏపీలో రిలయన్స్ జియో రికార్డుల సునామీ.. ఒక్క నెలలోనే ఎన్ని లక్షల మంది చేరారో తెలుసా?

Jio: జాతీయ స్థాయిలోనూ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో జియో తన టాప్ పొజిషన్‌ను కాపాడుకుంది. ఆగస్టులో పోటీదారుల కంటే 2.5 రెట్లు ఎక్కువ మంది హోమ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లను చేర్చుకుంది. దీనికి ప్రధానంగా జియో ఎయిర్‌ఫైబర్ సేవల హవానే కారణం. దేశవ్యాప్తంగా ఆగస్టులో జియో..

Jio: ఏపీలో రిలయన్స్ జియో రికార్డుల సునామీ.. ఒక్క నెలలోనే ఎన్ని లక్షల మంది చేరారో తెలుసా?
Jio
Subhash Goud
|

Updated on: Sep 29, 2026 | 11:47 AM

Share

Jio: ఆగస్టు 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో మొబైల్, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) విభాగాల్లో భారీగా చందాదారులను స్వంతం చేసుకుంటూ రిలయన్స్ జియో తన నెట్‌వర్క్ ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ ప్రాంతంలో జియో సాధిస్తున్న ప్రగతి, దేశవ్యాప్తంగా సంస్థ సాధిస్తున్న వృద్ధికి అద్దం పడుతోంది. జాతీయ స్థాయిలో కొత్త మొబైల్ యూజర్ల చేరికలో తన ప్రధాన పోటీదారు ఎయిర్‌టెల్‌ను అధిగమించడమే కాకుండా, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) విభాగాల్లోనూ జియో టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకుంది.

TRAI ఆగస్టు నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో ఒక్క నెలలోనే 2.12 లక్షల మంది కొత్త వైర్‌లేస్ మొబైల్ యూజర్లను ఖాతాలో వేసుకుంది. దీంతో ఏపీ సర్కిల్‌లో కంపెనీ మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య దాదాపు 3.29 కోట్లకు చేరింది. అంతేకాకుండా, విజిటర్ లొకేషన్ రిజిస్టర్ (VLR) నమోదు గరిష్ఠంగా ఉన్న రోజున ఏకంగా 96.95 శాతం యాక్టివ్ సబ్‌స్క్రైబర్ నిష్పత్తిని నమోదు చేసి, యూజర్ల విశ్వసనీయతను నిరూపించుకుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: కుప్పకూలిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలిస్తే షాపులకు క్యూ కట్టాల్సిందే!

జాతీయ స్థాయిలో, మెషిన్-టు-మెషిన్ (M2M) కనెక్షన్లను మినహాయించి, ఆగస్టులో జియో తన సమీప పోటీదారు ఎయిర్‌టెల్‌ కంటే సుమారు 3.7 రెట్లు అధికంగా హోమ్ లొకేషన్ రిజిస్టర్ (HLR) నెట్ చందాదారులను చేర్చుకుంది. అంతేకాకుండా, ఆగస్టు నెలలో సానుకూల నికర వృద్ధిని నమోదు చేసిన ఏకైక టెలికాం ఆపరేటర్‌గా జియో నిలిచింది. ఈ నెలలో సంస్థ 17 లక్షల మంది యాక్టివ్ VLR చందాదారులను అదనంగా చేర్చుకుంది. మే 2026 నుంచి వరుసగా మూడు నెలల కాలంలో సమీప పోటీదారు ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో సుమారు నాలుగు రెట్లు అధికంగా VLR నెట్ చందాదారులను నమోదు చేసింది.

వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో కొనసాగుతున్న పురోగతి

ఆగస్టులో ఏపీ టెలికాం సర్కిల్‌లో 25,211 కొత్త వైర్‌లైన్ కనెక్షన్లను జోడించడం ద్వారా జియో స్థిర బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో తన వృద్ధిని కొనసాగించింది. దీంతో ఈ సర్కిల్‌లో సంస్థ మొత్తం వైర్‌లైన్ చందాదారుల సంఖ్య సుమారు 21.55 లక్షలకు చేరింది. గృహాలు, వ్యాపార సంస్థలు, ఇతర వినియోగదారుల్లో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు పెరుగుతున్న ఆదరణకు ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తోంది. సంప్రదాయ వైర్‌లైన్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కష్టమైన ప్రాంతాలకు సైతం హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ఎయిర్‌ఫైబర్ వంటి వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ పరిష్కారాలు జియో స్థిర బ్రాడ్‌బ్యాండ్ వృద్ధికి మరింత ఊతమిస్తున్నాయి.

ఎఫ్‌డబ్ల్యూఏ విభాగంలో బ్రాడ్‌బ్యాండ్ వృద్ధికి ఊతం

ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లోని రెండు ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సాంకేతిక విభాగాల్లోనూ జియో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 5G FWA విభాగంలో 11,058 కొత్త కనెక్షన్లను జోడించడంతో, ఈ విభాగంలో జియో మొత్తం చందాదారుల సంఖ్య సుమారు 7.97 లక్షలకు చేరింది. UBR FWA విభాగంలో మరో 26,513 నికర కనెక్షన్లను జోడించడంతో, ఈ విభాగంలోని మొత్తం చందాదారుల సంఖ్య సుమారు 4.67 లక్షలకు పెరిగింది.

ఈ రెండు సాంకేతిక విభాగాలను కలిపి చూస్తే, ఏపీ టెలికాం సర్కిల్‌లో జియోకు 12.64 లక్షలకు పైగా వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రాంతీయంగా పెరుగుతున్న కనెక్టివిటీ అవసరాలను తీర్చడంలో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు కీలకంగా మారుతున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

జాతీయ స్థాయిలోనూ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో జియో తన టాప్ పొజిషన్‌ను కాపాడుకుంది. ఆగస్టులో పోటీదారుల కంటే 2.5 రెట్లు ఎక్కువ మంది హోమ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లను చేర్చుకుంది. దీనికి ప్రధానంగా జియో ఎయిర్‌ఫైబర్ సేవల హవానే కారణం. దేశవ్యాప్తంగా ఆగస్టులో జియో 4 లక్షల FWA కనెక్షన్లను జోడించగా, ఎయిర్‌టెల్ కేవలం 1 లక్షకే పరిమితమైంది. దీంతో జాతీయ FWA మార్కెట్‌లో జియో ఏకంగా 78.6 శాతం సింహభాగాన్ని సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి: మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! నదిలో 30 కి.మీ కొట్టుకుపోయి.. 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?

మొత్తానికి TRAI తాజా లెక్కలు.. మొబైల్ సెగ్మెంట్ నుండి బ్రాడ్‌బ్యాండ్, FWA వరకు ప్రతి విభాగంలోనూ రిలయన్స్ జియో తిరుగులేని టెలికాం లీడర్‌గా దూసుకుపోతోందని స్పష్టంచేస్తున్నాయి. తాజా TRAI చందాదారుల గణాంకాలు మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విభాగాల్లో జియో విస్తరిస్తున్న ఉనికిని స్పష్టం చేస్తున్నాయి. ఏపీ టెలికాం సర్కిల్‌లో గణనీయమైన చందాదారుల వృద్ధితో పాటు, యాక్టివ్ మొబైల్ చందాదారులు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ విభాగాల్లో జాతీయ స్థాయిలోనూ జియో తన నాయకత్వాన్ని కొనసాగిస్తోంది.

ఇది కూడా చదవండి: మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా? ఈ పరిస్థితికి దారితీసే నియమాలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us