AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! నదిలో 30 కి.మీ కొట్టుకుపోయి.. 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?

Odisha: పలు ప్రాంతాల్లో కురుస్తున్న రుతుపవన వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పలు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. శనివారం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని బడసాహి బ్లాక్‌లోని మనగోవిందాపూర్ పంచాయతీ పరిధిలోని కుంచిబానియా గ్రామం సమీపంలో గంగాహర్ నది..

Odisha: మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! నదిలో 30 కి.మీ కొట్టుకుపోయి.. 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?
River
Subhash Goud
|

Updated on: Sep 29, 2026 | 10:08 AM

Share

Odisha: శనివారం బ్రాహ్మణి నది ఒడ్డుకు వెళ్లినప్పుడు కొట్టుకుపోయి, దాదాపు 12 గంటల పాటు నదిలో ప్రాణాలతో ఉండి, సుమారు 30 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన 70 ఏళ్ల కేసి దలై అనే మహిళను రక్షించారు. కలఖండ్ గ్రామానికి చెందిన దలై, కేంద్రపారా జిల్లాలోని పట్టముండై సమీపంలో పడవలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు కనిపించింది. వారు ఆమెను రక్షించి, స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లే ముందు ప్రథమ చికిత్స అందించారు.

నీటిలోనే 12 గంటల పాటు కష్టాలు:

రక్షించిన దలై, ANIతో మాట్లాడుతూ, అది శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయం తాను కాలకృత్యాలు తీర్చుకోవడానికి నది ఒడ్డుకు వెళ్లానని, ఆ నేల ఎగుడుదిగుడుగా లేదా జారుడుగా ఉందని నేను గమనించలేదు. నేను అడుగు పెట్టగానే నా కాలు జారిందని, వెంటనే తాను నది మధ్యలోకి కొట్టుకుపోయానని చెప్పారు. రాత్రి 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు తాను నీటిలో తేలుతూనే ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో పట్టముండై సమీపానికి చేరుకున్నానని, ఇద్దరు వ్యక్తులు పడవలో అటుగా వెళ్తుంటే చేయి పైకెత్తి సాయం కోరానని తెలిపారు. వారు నా వద్దకు వచ్చి, నన్ను పడవలోకి లాగి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారని, నన్ను కాపాడి ఆ తర్వాత అంబులెన్స్‌కు ఫోన్ చేసి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు… అని చెప్పారు.

ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న రుతుపవన వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పలు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. శనివారం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని బడసాహి బ్లాక్‌లోని మనగోవిందాపూర్ పంచాయతీ పరిధిలోని కుంచిబానియా గ్రామం సమీపంలో గంగాహర్ నది కట్ట తెగిపోయింది. ఈ గండి కారణంగా విస్తారమైన వ్యవసాయ భూములు నీట మునిగాయి, వరద నీటి వల్ల ఎకరాల కొద్దీ వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!
కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!
మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?
మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?
మైలురాయి + సెంచరీ = విజయం.. కోహ్లీకి సోదరి స్పెషల్ మెసేజ్..!
మైలురాయి + సెంచరీ = విజయం.. కోహ్లీకి సోదరి స్పెషల్ మెసేజ్..!
బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?
బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?
తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ
వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ