Gold Rate: 2000లో తులం బంగారం ధర తెలిస్తే వెంటనే టైమ్ మెషీన్ కావాలంటారు..!
బాబోయ్ బంగారం అన్నారు మొన్నటిదాకా.. ఇలాగైతే ఇంకే కొంటామని వెనక్కితగ్గారు. లక్షన్నర అవుతుందని అంచనాలేశారు. కానీ రాకెట్‌లా దూసుకెళ్లిన పసిడి నిదానంగా కిందికి దిగొస్తోంది. ఈ పాతికేళ్లలో మరీ ముఖ్యంగా గడచిన ఐదేళ్లలో అసాధారణంగా పెరిగింది బంగారం ధర. . ..

2000లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 4వేల 400 ఉంది. 2010లో 20వేల 728 అయింది. అంటే పదేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. 2020లొ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50వేల 151కి చేరింది. 2020 టూ 2025 దాకా అంటే ఈ ఐదేళ్లకాలంలో రీసెంట్‌గా లక్ష క్రాస్ చేసింది.
పదిహేనేళ్లలో ఐదు రెట్లు.. జస్ట్ ఐదేళ్లలో 60 శాతం పెరుగుదల. 2025లో బంగారం రేటు ఏకంగా 39 శాతం మేర పెరిగింది. అంతకు ముందు 2024లో 27 శాతందాకా పెరిగింది గోల్డ్. కొన్నేళ్లుగా ఆకాశమే హద్దన్నట్లు దూసుకుపోయాయి పసిడి ధరలు. ఈనెలలోనే రికార్డు రేటును నమోదుచేసిన కనకానికి ఇక పట్టపగ్గాలు ఉండవనుకున్నారు. కానీ పెరుగుట విరుగుటకొరకే అన్నట్లు బంగారం నేలకు దిగొస్తోంది. దేశీయ మార్కెట్లో సరికొత్త రికార్డును టచ్‌చేసిన పసిడిధర కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది పసిడి ధరల్లో హెచ్చుతగ్గులెలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
గోల్డ్‌రేట్ రికార్డ్ స్థాయికెళ్లిందీ.. డౌన్‌ఫాల్ మొదలైందీ ఈ ఏడాదే. అప్‌అండ్‌డౌన్ ఎలా ఉందో ఓసారి గమనిస్తే..
–ఫిబ్రవరి నెలలో 85వేల 300 రూపాయలు
–మార్చిలో కాస్త పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 87వేల 550
–ఏప్రిల్‌లో ఒక్కసారిగా 98వేలకు పెరిగింది బంగారం ధర
— జూన్ నెలలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ లక్ష మార్క్ దాటింది
–ఆగస్టులో లక్షా 5వేల 170కి చేరుకుంది 10గ్రాముల ప్యూర్‌గోల్డ్
–సెప్టెంబరునెలలో స్పీడ్ పెంచి లక్షా 17వేల 570కి చేరింది
–అక్టోబరు 17 పసిడి కొత్త రికార్డ్ నమోదైంది. ఏకంగా లక్షా 32వేల 770 రూపాయలైంది
–అక్టోబరు 30.. అంటే ఇవాళ్టి రేటు రూ.1,23,150
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు కనకం నేలచూపులు చూట్టానికి బోలెడన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. యుద్ధభయం తగ్గినా, అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లను టచ్‌చేసినా గోల్డ్ రేట్ ఎఫెక్ట్ అవుతుంది. అసాధారణంగా పెరిగాక ఎక్కడోచోట కరెక్షన్ అనివార్యమవుతుంది.
బంగారం కంటే ఈక్విటీ మార్కెట్ నిలకడగా ఉందన్న నమ్మకం కూడా బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. బంగారం రేట్లు తగ్గడానికి, తగ్గుతాయన్న నమ్మకం పెరగడానికి ప్రధానమైన పది కారణాలేంటో తెలుసుకుందాం..
- రీజన్ 1- 60% ర్యాలీ తర్వాత భారీ లాభాల బుకింగ్
- రీజన్ 2- ఓవర్‌బాట్ స్థాయికి చార్ట్ ఆధారిత అమ్మకాలు కూడా ఓ కారణం
- రీజన్ 3 – తగ్గాక చూసుకుందామని రిటైల్ కస్టమర్లు కొనుగోళ్లు వాయిదావేసుకోవడం
- రీజన్ 4 – 14, 18 క్యారెట్ ఆభరణాలకు జెన్ Z అంటే..ఈ జనరేషన్ షిఫ్ట్ అవుతోంది
- రీజన్ 5 – ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు సడలింపుతో బులియెన్ మార్కెట్ ప్రభావితం
- రీజన్ 6 – ఈక్విటీ మార్కెట్లలో SIPవైపు రిటైల్ ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు
- రీజన్ 7 – భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇది కూడా ఓ రీజన్
- రీజన్ 8 – పసిడి ధరల కరెక్షన్ సంకేతాల ప్రభావంతో మార్కెట్ మూడ్‌మారింది
- రీజన్ 9- వెండి డౌన్ సైడ్ టార్గెట్ కూడా పసిడి ధరలపై ఎఫెక్ట్ చూపుతోంది
- రీజన్ 10 – ఫెడ్ పాలసీ రివర్సల్, రిటైల్ ఇన్వెస్టర్ల రీ ఎంట్రీ..
ఓసారి పెరిగాక పడిపోవడం అసాధ్యమనుకోడానికి లేదు. ఎందుకంటే 80ల్లో ఒకే ఏడాది అనూహ్యంగా 53 శాతం పడిపోయింది బంగారం ధర. ఆ తర్వాత.. 2013లో ఒకేరోజు 7.5 శాతం తగ్గింది. ఇప్పుడు గోల్డ్‌మార్కెట్లో అదే ట్రెండ్ కనిపిస్తోంది.




