Gold Price Today: మగువలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందో తెలుసా..?

బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. ఇటీవల నుంచి గోల్డ్‌ ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ధరలు ఎంత పెరిగినా.. కొనక తప్పడం లేదు. ధరలు ఎంత పెరిగి కూడా బంగారం షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి..

Gold Price Today: మగువలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: May 06, 2023 | 5:35 AM

ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇటీవల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు తాజాగా శనివారం కూడా పెరిగాయి. 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,000 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.62,400 వద్ద ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.57,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,550 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.57,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,450 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది.

వెండి ధర:

ఇక వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలోపై రూ.1150 వరకు ఎగబాకింది. ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.83,700, ముంబైలో రూ.78,250, ఢిల్లీలో రూ.78,250, కోల్‌కతాలో కిలో వెండి రూ.78,250, బెంగళూరులో రూ.83,700, హైదరాబాద్‌లో రూ.83,700, విజయవాడలో రూ.83,700 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి