Gold Price Today: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
Gold and Silver Price Today: మళ్లీ బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కాస్త తగ్గుముఖం పట్టిన ధరలు.. ఇప్పుడు భగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. మరీ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold and Silver Rates: మళ్లీ బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజులుగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పరుగులు పెడుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. నిన్న ఒక్క రోజు తులం బంగారంపై వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది. అలాగే వెండి కూడా భారీగానే పెరిగింది. జనవరి 11వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
Mukesh Ambani: అంబానీ ఒక రోజులో ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,900 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,000 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే..ఇది కూడా భారీగా పెరుగుతోంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన వెండి.. మళ్లీ పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజు వెండిపై ఏకంగా రూ.11 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం అంటే ఆదివారం కిలో వెండి ధర రూ. హైదరాబాద్‌లో రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో రూ.2,60,000 ఉంది.
ఇది కూడా చదవండి: Home Loan: ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి? EMI ఎంత?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
