Gold Price Today: ఇంతట్లో తగ్గెటట్లు లేదుగా.. రూ. లక్షా 5వేలు దాటిన బంగారం ధర
Gold Price Today: బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు..

Gold Price Today: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇంతట్లో ఆగేటట్లు లేనట్లు కనిపిస్తోంది. రోజురోజుకు బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. సామాన్యుడు బంగారం కొనాలంటే వెనుకంజ వేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఏదైనా కొనుగోలు చేయాలంటే ముందుగా బంగారంపై ఆసక్తి చూపే వారు. కానీ ఇప్పుడు బంగారం అంటేనే భయపడే రోజులు వచ్చాయి. రోజురోజుకు తులం ధరపై వందల రూపాయలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో తులం ధర లక్షా 5 వేల రూపాయలు దాటేసింది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర1,04,940 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 96,190 రూపాయలు ఉంది.
ఇది కూడా చదవండి: BSNL: ఆశ్చర్యపరిచే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్.. రూ.151తో 30 రోజుల వ్యాలిడిటీ.. 40GB డేటా!
ఇది కూడా చదవండి: LPG Gas Price: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర
ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు:
హైదరాబాద్:
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,04,940
- 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,190
ఢిల్లీ:
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,090
- 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,340
ముంబై:
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,04,940
- 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,190
చెన్నై:
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,04,940
- 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,190
బెంగళూరు:
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,04,940
- 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,190
కిలో వెండి ధర: రూ.1,24,900
ధరలు పెరగడానికి కారణాలు ఏంటి?
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. అంతేకాదు ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం వల్ల ధరలు ఇంకా ఎగబాకుతున్నాయి. ఇక రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా.
ఇది కూడా చదవండి: Indian Railways: ఇది భారతదేశంలో అత్యంత చౌకైన సూపర్‌ఫాస్ట్ రైలు.. AC ప్రయాణానికి కేవలం 68 పైసలే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








