Gold Price Today: తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్‌ నెలలో పరుగులు పెట్టిన పసిడి ధర.. నెల చివరిలో కాస్త స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్‌ 30వ తేదీన పది గ్రాముల బంగారం ధరపై స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.72,590 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో..

Gold Price Today: తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Apr 30, 2024 | 6:19 AM

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్‌ నెలలో పరుగులు పెట్టిన పసిడి ధర.. నెల చివరిలో కాస్త స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్‌ 30వ తేదీన పది గ్రాముల బంగారం ధరపై స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.72,590 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయ.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,520 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,590 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,740 ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,590 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,590 ఉంది. ఇక దేశంలో కిలో వెండి ధర రూ.83,900 ఉంది.

ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ధరలు వివిధ స్వచ్ఛతలతో కూడిన బంగారం ప్రామాణిక ధర గురించి సమాచారాన్ని అందజేస్తాయి. ఈ ధరలన్నీ పన్ను, మేకింగ్ ఛార్జీలకు ముందు ఉంటాయి. కానీ వాటి ధరలలో జీఎస్టీ ఉండదు. ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, పన్నులు కూడా ఉన్నందున బంగారం లేదా వెండి ధరలు ఎక్కువగా ఉంటాయని గుర్తించుకోవాలి.

హాల్‌మార్క్‌ ఉన్న నగలే కొనుగోలు చేయండి:

మీరు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌తో ఎల్లప్పుడూ ధృవీకరించబడిన బంగారాన్ని కొనుగోలు చేయండి. కొత్త నిబంధన ప్రకారం, ఆధార్ కార్డుపై 12 అంకెల కోడ్ ఉన్నట్లే, బంగారంపై కూడా 6 అంకెల హాల్‌మార్క్ కోడ్ ఉంటుంది. దీన్ని హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) అంటారు. ఈ సంఖ్య ఆల్ఫాన్యూమరిక్ కావచ్చు. అంటే ఇలాంటిది – AZ4524. హాల్‌మార్కింగ్ ద్వారా బంగారం ఎన్ని క్యారెట్ల ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి