Gold Price: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలిస్తే షాకవుతారు

బలహీనమైన గ్లోబల్ ట్రెండ్, ట్రేడర్‌ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. దేశంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగించింది. తాజాగా అంటే ఏప్రిల్‌ 24వ తేదీన దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గింది..

Gold Price: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలిస్తే షాకవుతారు
Gold Prices
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2024 | 5:00 AM

బలహీనమైన గ్లోబల్ ట్రెండ్, ట్రేడర్‌ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. దేశంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగించింది. తాజాగా అంటే ఏప్రిల్‌ 24వ తేదీన దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.1400 ధర తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1530 తగ్గింది. ప్రస్తుతం తులం గోల్డ్‌ ధర రూ.72,160 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

  • చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,100 ఉంది.
  • ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160 ఉంది.
  • ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,310 ఉంది.
  • హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160 ఉంది.
  • కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160 ఉంది.
  • బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160 ఉంది.
  • కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160 ఉంది.
  • విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160 ఉంది.

ఇదిలా ఉండగా, బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా రూ.2500 వరకు తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం దేశీయంగా కిలో సిల్వర్‌ ధర రూ.83,000 వద్ద కొనసాగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ధరలను చెక్‌ చేసుకుని వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి