Gold Price Today: గోల్డ్ లవర్స్ ఇది విన్నారా.! హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే
బంగారం ధరలలో ఈ మధ్యకాలంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు పెరుగుతూపోతుంటే.. మరికొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఇవాళ హైదరాబాద్ లో తులం బంగారం ఎంతుందంటే.. అటు వెండి ధరలు కూడా ఇలా.. ఆ వివరాలు ఈ స్టోరీలో ఓ లుక్కేయండి.

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం వచ్చినా.. బంగారం కొనుగోలు చేస్తుంటారు మహిళలు. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచంలో ఉన్న బంగారంలో.. సుమారు 25 టన్నుల గోల్డ్ మన మహిళల దగ్గరే ఉంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్న వరుసగా ఐదు రోజులు గోల్డ్ ధరలు పెరిగితే.. శుక్రవారం బంగారం ధర తగ్గింది. అలాగే మళ్లీ శనివారం పెరగ్గా.. ఆదివారం స్థిరంగా కొనసాగుతోంది. ఇక సోమవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,440 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,760 గా ఉంది. అటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి రూ. 100 మేరకు తగ్గి.. రూ. 1,00,400గా కొనసాగుతోంది.
22 క్యారెట్ల బంగారం ధర..
- హైదరాబాద్ – రూ. 80,440
- విజయవాడ – రూ. 80,400
- చెన్నై – రూ. 80,440
- బెంగళూరు – రూ. 80,440
- ఢిల్లీ – రూ. 80,590
- ముంబై – రూ. 80,440
- కోల్‌కతా – రూ. 80,440
24 క్యారెట్ల బంగారం ధర..
- హైదరాబాద్ – రూ. 87,760
- విజయవాడ – రూ.87,760
- చెన్నై – రూ. 87,760
- బెంగళూరు – రూ. 87,760
- ఢిల్లీ – రూ. 87,910
- ముంబై – రూ. 87,760
- కోల్‌కతా – రూ. 87,760
వెండి ధరలు ఇలా..
- హైదరాబాద్ – రూ. 1,06,900
- విజయవాడ – రూ. 1,06,900
- చెన్నై – రూ. 1,06,900
- బెంగళూరు – రూ. 1,00,400
- ఢిల్లీ – 1,00,400
- ముంబై – 1,00,400
- కోల్‌కతా – 1,00,400
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




