Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి.

Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Price
Follow us
Venkata Chari

|

Updated on: Feb 05, 2024 | 6:08 AM

Gold and Silver Latest Prices: ప్రపంచ వ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి. తాజాగా ఫిబ్రవరి 5, సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధరలో నిన్నటితో పోల్చితే ఎటువంటి మార్పు లేకుండా, రూ.5,810ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,338ల వద్ద కొనసాగుతోంది.

ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,100లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,380ల వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.4,754 వద్ద ఉండగా.. 10 గ్రాములు ధర రూ.47,540లుగా నిలిచింది.

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,540

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,100

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,380

విజయవాడలో బంగారం ధరలు ఇలా..

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,540

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,100

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,380

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,100లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,380లు, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,700లు, 24 క్యారెట్ల ధర రూ.64,040లు ఉంది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,380లు ఉంది. కోల్‌కతా, ముంబై, కేరళ, పూణెలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఇక వెండి ధరల విషయాని కొస్తే.. వెండి కిలో రూ.75,500లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,000లు, విశాఖపట్నంలో రూ.77,000లు, చెన్నైలో రూ.77,000ల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ.75,500, ముంబైలో75,500లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..