Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంత ఉందంటే..

ఇదిలా ఉంటే వరుసగా ప్రతీ రోజూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు గత రెండు రోజులుగా బ్రేక్‌లు పడుతున్నాయి. సోమవారం స్వల్పంగా తగ్గి బంగారం ధర మంగళవారం మరోసారి తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరల్లో బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంత ఉందంటే..
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 23, 2024 | 6:42 AM

బంగారం పేరు వింటనేనే దడ పుట్టే పరిస్థితి వచ్చింది. ఆల్‌టైమ్‌ రికార్డ్‌తో గోల్డ్‌ ధరలు పరగులు పెడుతున్నాయి. కేవలం రెండు నెలల్లోనే సుమారు రూ. 15 వేల వరకు బంగారం ధర పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, యుద్ధ వాతావరణ నేపథ్యంలో గోల్డ్‌ ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. ఇక ఈ ఏడాది చివిర నాటికి తులం బంగారం ధర కచ్చితంగా రూ. 80 వేల వరకు చేరుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే వరుసగా ప్రతీ రోజూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు గత రెండు రోజులుగా బ్రేక్‌లు పడుతున్నాయి. సోమవారం స్వల్పంగా తగ్గి బంగారం ధర మంగళవారం మరోసారి తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరల్లో బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,830గా ఉంది. ఇక ముంబయిలో 22 క్యారెట్ల ధర రూ. 67,540, 24 క్యారెట్ల ధర రూ. 73,680 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 68,440, 24 క్యారెట్ల ధర రూ. 74,660 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 67,540 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,689 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,540కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,689 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతోపాటు విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు కూడా..

ఇదిలా ఉంటే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 85,400గా ఉంది. అలాగే చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయావడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 88,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..