Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?
Gold Rates Today: బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు ఒక రోజు
Gold Rates Today: బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ధర గురించి ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే వేసవికాలంలో శుభకార్యాలు కూడా ఉండటంతో బంగారంపై చాలామంది ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. బుధవారం పెరిగిన బంగారం ధరలు.. గురువారం స్వల్పంగా తగ్గాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 250 రూపాయల మేర తగ్గింది. అయితే.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
● దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 250 మేర తగ్గింది. నిన్న రూ.43,500 ఉన్న ధర ఈ రోజు 43,250 ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 47,180 గా ఉంది.
● ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 43,370 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,370 వద్ద కొనసాగుతోంది.
● బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,100 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 44,840 వద్ద కొనసాగుతోంది.
● చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,540 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు..
● హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,100 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.44,840 వద్ద కొనసాగుతోంది.
● విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 44,840 వద్ద కొనసాగుతోంది.
● విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 44,840 వద్ద కొనసాగుతోంది.
కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు 55 వేల వరకు మార్క్ దాటి పోయిన బంగారం ధరలు ప్రస్తుతం 42 వేలకు అటు ఇటుగా ఉన్నాయి.
Also Read: