Gold Price: ఆల్‌టైమ్ రికార్డుకు బంగారం ధర.. తులం లక్ష దాటనుందా.?
ఇదిలా ఉంటే ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు ఇలా రకరకాల కారణాలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర...

బంగారం అంటేనే వామ్మో అని పరిస్థితి నెలకొంది. రోజురోజుకీ పెరుగుతోన్న బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో అన్ని నగరాల్లో బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు ధరలకు చేరుకున్నాయి. ఏప్రిల్ 12వ తేదీన 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 1090కి చేరింది. దీంతో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 73,310కి చేరింది.
ఇదిలా ఉంటే ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు ఇలా రకరకాల కారణాలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే తులం లక్ష దాటడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1090 పెరిగి ప్రస్తుతం రూ. 73,310 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1000 పెరిగి రూ. 67,200 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1090 పెరిగి రూ. 73,460గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 పెరిగి అత్యధికంగా రూ. 68,050గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 880 పెరిగి రూ. 74,240 వద్ద కొనసాగుతోంది.
* ఇక బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1000 పెరిగి రూ. 67,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,310 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 1000 పెరిగి రూ. 67,200 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ. 73,310 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




