AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌.. లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర

Gold Rate In Hyderabad: బంగారం లక్ష రూపాయలు చేరుకునే సమయం వచ్చేసింది. తులం బంగారం కొనాలంటే లకారాన్ని దగ్గర పెట్టుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పసిడి ధర టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. బంగారం ధర ఊహకందని రేంజ్‌లో పైపైకి పాకిపోతోంది. ఇంతలా పెరిగిపోతుంటే..

Gold Price: వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌.. లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర
Subhash Goud
|

Updated on: Apr 21, 2025 | 5:42 PM

Share

Gold Rate In Hyderabad: ఇది కొత్త బంగారు లోకం. లక్ష మైలురాయిని టచ్‌ చేసింది గోల్డ్‌. 15 రోజుల క్రితం ప్రారంభమైన పసిడి పరుగు.. బంగారాన్ని లకారం దగ్గరకు చేర్చింది. 10గ్రాముల 24 క్యారట్స్ గోల్డ్‌.. లక్ష రూపాయలను టచ్‌ చేసింది. ఇవాళ రిటైల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు ఎలా ఉన్నాయో, లైవ్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బంగారం భగ్గుమంటోంది.. ఎక్కడా తగ్గనంటోంది.. లక్ష మైలు రాయిని చేరుకుంది. ఉంది. ఇక బంగారం రేట్లు ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఒకవైపు సుంకాలతో బాదేస్తున్న ట్రంప్‌, మరోవైపు తమ దేశంలోని సెంట్రల్‌బ్యాంక్‌ను కూడా టెన్షన్‌ పెడుతున్నారు. దీంతో గోల్డ్‌ రేట్లు ఇంకా పెరిగేలా ఉన్నాయి. మిస్టర్‌ ట్రంప్‌ లేటెస్టుగా ఇస్తున్న షాకులేంటో చూద్దాం.

ఇక గోల్డ్‌ రేట్లు అడ్డగోలుగా పెరిగిపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. బంగారం-లకారం అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆడపిల్ల పెళ్లి ఎలా చేయాలిరా దేవుడా అంటూ జనం వాపోతున్నారు. పెళ్లిళ్లలో ఇంక బంగారం కొనడం కలే అంటున్నారు మరికొందరు. గోల్డ్‌ గురించి మర్చిపోండంటూ సలహా ఇస్తున్నారు.

బంగారం ధర దడ పుట్టిస్తోంది. బ్రేకులు లేకుండా పరుగులు పెడుతోంది. తాజాగా లైవ్‌ మార్కెట్‌లో 10గ్రాముుల బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలకు చేరింది.అంతర్జాతీయ మార్కెట్‌లో 3400డాలర్లకు చేరిన ఔన్స్ బంగారం ధర.. ప్రస్తుతం హైదరాబాద్‌ రిటైల్‌ మార్కెట్‌లో మాత్రం 99860రూపాయలకు చేరింది. కేవలం 140 రూపాయల తేడాతో హైదరాబాద్‌ రిటైల్ మార్కెట్ ఈ ధర నమోదవుతోంది. రేపు ఉదయం మార్కెట్‌లో బంగారం ధర లక్ష రూపాయలు దాటనుంది. ఇక వెండి ధర కూడా తగ్గేదిలే అన్నట్లు పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర లక్షా 11 వేల రూపాయలకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌ను ట్రంప్‌ భయం వదలడం లేదు. US ఫెడ్‌ చీఫ్‌ పావెల్‌ను తొలగిస్తానంటూ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఫెడ్‌ స్వతంత్రతకు భంగం వాటిల్లవచ్చని ఇన్వెస్టర్ల ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో యూఎస్‌ ఫెడ్‌ ట్రంప్‌ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ట్రంప్‌ తీరుతో గోల్డ్‌పై పెట్టుబడికే ఇన్వెస్టర్ల మొగ్గు. బంగారం రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్గెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Gold ATM: అద్భుతం.. ఈ ఏటీఎంలో బంగారం పెడితే డబ్బులు.. గోల్డ్ నాణ్యత కూడా చెప్పేస్తుంది !

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి