Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలకు మంగళవారం బ్రేక్ పడినా.. బుధవారం మాత్రం తులంపై ఏకంగా రూ. 200 పెరగడంతో గోల్డ్ లవర్స్‌కి మరోసారి షాక్ తగిలింది.
గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలకు మంగళవారం బ్రేక్ పడినా.. బుధవారం మాత్రం తులంపై ఏకంగా రూ. 200 పెరగడంతో గోల్డ్ లవర్స్‌కి మరోసారి షాక్ తగిలింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
* దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,00 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,770 వద్ద నమోదైంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,000 వద్ద ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,050 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 ఉంది.
వెండి ధర ఎలా ఉందంటే..
బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. బుధవారం దేశంలో కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది. ఈరోజు చెన్నైలో కిలో వెండి ధర రూ.74,700, ముంబైలో రూ.72,100, ఢిల్లీలో రూ. 72,100, కోల్‌కతాలో కిలో వెండి రూ. 72,100 బెంగళూరులో రూ.74,700, హైదరాబాద్‌లో రూ.74,700, విశాఖ, విజయవాడలో రూ.74,700 వద్ద ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.
రిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..